RRR: హైదరాబాదులో 'ఆర్ఆర్ఆర్' స్పెషల్ షోలు వేసే థియేటర్లు ఇవే!

Five theaters gets nod for RRR special screanings in Hyderabad

  • రేపు ఆర్ఆర్ఆర్ గ్రాండ్ రిలీజ్
  • రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్
  • ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా చిత్రం
  • తెలంగాణ, ఏపీలో బెనిఫిట్ షోలకు అనుమతి
  • బెనిఫిట్ షోలకు ముందు హైదరాబాదులో స్పెషల్ షోలు

తెలుగు సినీ చరిత్రలో భారీ చిత్రాల మొనగాడుగా పేరుగాంచిన దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రూపుదిద్దుకున్న 'ఆర్ఆర్ఆర్' రేపు (మార్చి 25) విడుదల అవుతోంది. రామ్ చరణ్, ఎన్టీఆర్ ల నటవిశ్వరూపం అంటూ ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో, తొలి ఆట చూసేందుకు అభిమానులు ఉవ్విళ్లూరుతున్నారు. 

కాగా 'ఆర్ఆర్ఆర్' చిత్రాన్ని హైదరాబాదులోని 5 థియేటర్లలో స్పెషల్ స్క్రీనింగ్ వేయనున్నారు. అర్జున్ థియేటర్ (కూకట్ పల్లి), మల్లికార్జున (కూకట్ పల్లి) భ్రమరాంబ (కూకట్ పల్లి), విశ్వనాథ్ (కూకట్ పల్లి), మూసాపేటలోని శ్రీరాములు థియేటర్లలో ఈ స్పెషల్ షోలకు అనుమతి లభించింది. ఈ స్పెషల్ షోలు ఉదయం 7 గంటల కంటే ముందే ప్రారంభం కానున్నాయి. వీటి అనంతరం, బెనిఫిట్ షోలు ఉదయం 7 గంటల నుంచి షురూ అవుతాయి.

  • Loading...

More Telugu News