NSA Doval: జై శంకర్, దోవల్ తో చైనా విదేశాంగ మంత్రి చర్చలు
- సుదీర్ఘ విరామం తర్వాత ఉన్నత స్థాయి భేటీ
- 2020 గల్వాన్ ఘర్షణ తర్వాత దెబ్బతిన్న సంబంధాలు
- పునరుద్ధరణకు డ్రాగన్ యత్నాలు
భారత్ - చైనా దేశాల మధ్య సుదీర్ఘ విరామం అనంతరం ఓ ఉన్నతస్థాయి భేటీ సాధ్యపడింది. భారత పర్యటనకు గురువారం విచ్చేసిన చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ.. శుక్రవారం ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్ లో భారత విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ తో భేటీ అయ్యారు. అంతకుముందు సౌత్ బ్లాక్ లోని జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ నివాసానికి వెళ్లి కూడా చర్చలు జరిపారు.
ఆ సందర్భంగా కశ్మీర్ అంశాన్ని ప్రస్తావించి, ఇస్లామిక్ స్నేహితుల అభిప్రాయాలకు మద్దతు పలుకుతున్నట్టు ప్రకటించి వివాదం రాజేశారు. కశ్మీర్ పై వాంగ్ యీ వ్యాఖ్యలను భారత్ తీవ్రంగా ఖండించింది. చైనా సహ మరే ఇతర దేశానికి భారత్ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకునే హక్కు లేదని తేల్చి చెప్పింది.