TSRTC: బస్ పాస్ ధరలను భారీగా పెంచుతున్న టీఎస్ఆర్టీసీ
- ఇటీవలే బస్ పాస్ ధరలను పెంచిన టీఎస్ఆర్టీసీ
- ఏప్రిల్ 1 నుంచి బస్ పాస్ ధరల పెంపు
- స్టూడెంట్ పాస్ లకు మినహాయింపు
ఇటీవలే టికెట్ ధరలను టీఎస్ఆర్టీసీ భారీగా పెంచిన సంగతి తెలిసిందే. తాజాగా మరో బాదుడుకు సిద్ధమవుతోంది. ఏప్రిల్ 1 నుంచి బస్ పాస్ ధరలను భారీగా పెంచబోతోంది. అయితే స్టూడెంట్ పాసుల ఛార్జీలకు మాత్రం మినహాయింపును ఇచ్చింది. విద్యా సంవత్సరం ముగుస్తున్న నేపథ్యంలో విద్యార్థుల బస్ పాస్ ఛార్జీలను పెంచలేదా? లేక వచ్చే విద్యా సంవత్సరంలో పెంచుతుందా? అనే విషయం తెలియాల్సి ఉంది.
పెరుగుతున్న బస్ పాస్ ఛార్జీలు ఇవే:
బస్ పాస్ రకం | పాత ధర | కొత్త ధర |
ఆర్డినరీ | 950 | 1150 |
ఎక్స్ ప్రెస్ | 1070 | 1300 |
డీలక్స్ | 1185 | 1450 |
ఏసీ బస్సు | 2500 | 3000 |
ఎన్జీవో ఆర్డినరీ | 320 | 400 |
ఎన్జీవో మెట్రో ఎక్స్ ప్రెస్ | 450 | 550 |
ఎన్జీవో డీలక్స్ | 575 | 700 |