Tollywood: కొడుకుగా నన్ను గర్వపడేలా చేశాడు.. చరణ్ పుట్టినరోజు సందర్భంగా అరుదైన చిత్రాన్ని పంచుకున్న చిరంజీవి

Chiru Wishes Son Ramcharan Birth Day with a Rare Photo

  • ఇవాళ రామ్ చరణ్ 38వ పుట్టినరోజు
  • సోషల్ మీడియాలో విషెస్ చెప్పిన చిరూ
  • సోషల్ మీడియాలో విషెస్ చెప్పడం వింతగా ఉందన్న మెగాస్టార్
  • ఆర్ఆర్ఆర్ విజయాన్ని బాధ్యతతో స్వీకరిస్తానన్న చెర్రీ

రామ్ చరణ్ ఇవాళ 38వ పడిలోకి అడుగుపెట్టాడు. ఈ పుట్టినరోజు చరణ్ కు చాలా స్పెషల్ అనే చెప్పాలి. గత శుక్రవారం విడుదలైన ‘ఆర్ఆర్ఆర్’ సినిమా బాక్సాఫీస్ వద్ద అఖండ విజయాన్ని సొంతం చేసుకుంది. దీంతో ఆయన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ‘‘రాజమౌళిగారి ‘ఆర్ఆర్ఆర్’ సినిమా పట్ల మీరు చూపిస్తున్న ప్రేమ, ఆదరణకు హృదయపూర్వక ధన్యవాదాలు. వెలకట్టలేని ఈ పుట్టినరోజు కానుకను ఎంతో బాధ్యతతో స్వీకరిస్తా’’ అని ఆయన ట్వీట్ చేశారు.  

కాగా, చిరంజీవి కూడా చరణ్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. అభిమానులతో ఓ అరుదైన చిత్రాన్ని పంచుకున్నారు. ‘‘సోషల్ మీడియా ద్వారా చరణ్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలపడం నాకు వింతగా అనిపిస్తోంది. కొడుకుగా నన్ను చరణ్ గర్వపడేలా చేశాడు. అతడే నా గౌరవం. హ్యాపీ బర్త్ డే చరణ్’’ అని చిరంజీవి ట్వీట్ చేశారు. 

చరణ్ పుట్టినరోజు సందర్భంగా ఒక అరుదైన చిత్రాన్ని పంచుకుంటే అభిమానులు సంతోషిస్తారనిపించిందని పేర్కొన్న ఆయన.. చరణ్ చిన్నప్పుడు ఓ సినిమా షూటింగ్ సందర్భంగా బుగ్గమీద వేలితో తడుతూ ప్రేమ చూపిస్తున్న ఫొటోను ట్వీట్ చేశారు. ఆచార్య సినిమా షూటింగ్ సందర్భంగా కూడా చరణ్ బుగ్గపై వేలితో నిమిరే ఫొటోనూ దానికి ఆయన జత చేశారు. కొరటాల శివ దర్శకత్వంలో చిరు, చరణ్ లు కలిసి నటిస్తున్న సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News