Prabhas: ప్రభాస్ సినిమా కోసం తెరపైకి అనుష్క పేరు!

Anushka in Prabhas Movie
  • కొంతకాలంగా సినిమాలకి దూరంగా అనుష్క 
  • ప్రభాస్ తో సినిమా ప్లాన్ చేసిన మారుతి 
  • అనుష్కను సంప్రదించినట్టుగా వార్తలు 
తెలుగులో నాయిక ప్రధానమైన కథలను తెరకెక్కించాలనుకునేవారు ముందుగా పరిశీలించే పేరు అనుష్క. ఆమె చేసిన 'అరుంధతి' .. 'రుద్రమదేవి' .. 'భాగమతి' స్టార్ హీరోల సినిమాలతో సమానమైన వసూళ్లను రాబట్టాయి. ఇక హీరోతో ఆమె స్క్రీన్ షేర్ చేసుకోవలసి వస్తే, ప్రభాస్ సరసన నాయికగా ఆమెను చూడటానికి అభిమానులు ఇష్టపడతారు.  

అందుకు కారణం ఈ ఇద్దరి కాంబినేషన్లో వచ్చిన సినిమాలు, భారీ విజయాలను సాధించడమే. జోడీ అదిరింది అన్నట్టుగా ఈ జంట తెరపై కనిపించడమే. 'బాహుబలి 2' తరువాత ఈ జోడీ తెరపై కనిపించలేదు. కానీ ఆ సమయం కోసం అంతా ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో ఈ జంటను మళ్లీ తెరపై చూడటానికి మరెంతో సమయం లేదనే ఒక టాక్ ఇండస్ట్రీలో బలంగా వినిపిస్తోంది.

ప్రభాస్ తో ఒక సినిమా చేయడానికి మారుతి సన్నాహాలు చేసుకుంటున్నాడు. ఇందులో ముగ్గురు హీరోయిన్లు ఉండనున్నట్టుగా వార్తలు వచ్చాయి. ఒక కథానాయికగా కృతి శెట్టినీ .. మరో కథానాయికగా మాళవిక మోహనన్ ను ఎంపిక చేసినట్టుగా ప్రచారం జరుగుతోంది. ఈ సినిమాలో ప్రధానమైన కథానాయికగా అనుష్క కనిపించనుందనేది తాజా సమాచారం. కొంతకాలంగా అనుష్క సినిమాలకి దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే.  
Prabhas
Anushka Shetty
Maruthi Movie

More Telugu News