Andhra Pradesh: ఏపీలో పెరగనున్న విద్యుత్ ఛార్జీలు.. ఎంత మేర పెరగొచ్చంటే..!

Electric Charges to increase in Andhra Pradesh

  • విద్యుత్ ఛార్జీల పెంపుకు డిస్కమ్ ల ప్రతిపాదనలు
  • యూనిట్ కు 20 పైసల నుంచి రూ. 1.40 వరకు అదనపు భారం
  • ఆగస్ట్ నుంచి కొత్త ఛార్జీలు అమల్లోకి వచ్చే అవకాశం

ఏపీలో కరెంట్ ఛార్జీలు పెరగబోతున్నాయి. విద్యుత్ ఛార్జీల పెంపుకు డిస్కమ్ లు ప్రతిపాదించాయి. రాష్ట్రంలో ప్రస్తుతం 13 శ్లాబ్ లు ఉండగా... వీటిని 6 శ్లాబ్ లకు కుదించనున్నారు. పేద, మధ్యతరగతి ప్రజలు ఉండే శ్లాబ్ లపై యూనిట్ కు 20 పైసల నుంచి రూ. 1.40 వరకు భారం పడే అవకాశం ఉంది. కొత్త ఛార్జీలు ఆగస్ట్ నుంచి అమల్లోకి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. కొత్త ఛార్జీలకు సంబంధించి ఈ నెల 30న ఏపీఈఆర్సీ ఉత్తర్వులను వెలువరించే అవకాశం ఉంది. జులై వరకు పాత ఛార్జీలనే వసూలు చేయనున్నారు. 

ఆగస్టు నుంచి అమలుకు ప్రతిపాదించిన టారిఫ్ వివరాలు (రూపాయల్లో):
కేటగిరీ
యూనిట్లు
టారిఫ్
0 - 30  
1.45 
31 - 75
2.80 
బీ
0 - 100
4.00 
బీ
101 - 200
5.00
బీ
201 - 300
7.00
బీ
300 యూనిట్లకు పైన
7.50

  • Loading...

More Telugu News