Seethakka: భారత్ ను విచ్ఛిన్నం చేయాలనుకునేవాళ్లు 'కశ్మీర్ ఫైల్స్' చూడండి... భారత్ ను కలిపి ఉంచాలనుకునేవాళ్లు 'ఆర్ఆర్ఆర్' చూడండి: సీతక్క

MLA Seethakka watch RRR movie and congratulate entire crew and cast
  • 'ఆర్ఆర్ఆర్' చిత్రాన్ని వీక్షించిన సీతక్క
  • సినిమా అద్భుతంగా ఉందని కితాబు
  • రాజమౌళికి అభినందనలు
  • ఎన్టీఆర్, చరణ్ నమ్మశక్యం కాని నటన కనబర్చారని ప్రశంసలు
తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే ధనసరి అనసూయ (సీతక్క) తాజాగా 'ఆర్ఆర్ఆర్' చిత్రాన్ని వీక్షించారు. సినిమా ఎంతో అద్భుతంగా ఉందని సీతక్క ప్రశంసించారు. భారతదేశాన్ని విచ్ఛిన్నం చేయాలనుకునేవారు 'కశ్మీర్ ఫైల్స్' చిత్రాన్ని చూడాలని, భారత్ ను ఐక్యంగా ఉంచాలనుకునేవాళ్లు 'ఆర్ఆర్ఆర్' చిత్రాన్ని చూడాలని ఆమె ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. 'ఆర్ఆర్ఆర్' చిత్రానికి అన్ని రాష్ట్రాల్లో పన్ను మినహాయింపు ఇవ్వాలని సీతక్క అభిప్రాయపడ్డారు. దర్శకుడు రాజమౌళికి అభినందనలు తెలిపారు. సోదరులు రామ్ చరణ్, ఎన్టీఆర్ నమ్మశక్యంకాని రీతిలో నటనా ప్రతిభ కనబర్చారని కొనియాడారు.
Seethakka
RRR
Rajamouli
Ramcharan
Jr NTR
The Kashmir Files

More Telugu News