Nara Lokesh: అప్పుడు రూ.20 లక్షలు డిమాండ్ చేసి.. ఇప్పుడు రూ.2 లక్షలిస్తారా?: జగన్‌కు లోకేశ్ ప్రశ్న
- భాకరాపేట ప్రమాదాన్ని ప్రస్తావించిన లోకేశ్
- మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు ప్రకటించడంపై నిరసన
- ట్విట్టర్ వేదికగా జగన్‌ను విమర్శించిన లోకేశ్
ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మరోమారు ట్విట్టర్ వేదికగా ప్రశ్నలు సంధించారు. విపక్ష నేతగా ఉన్న సమయంలో రోడ్డు ప్రమాద మృతుల కుటుంబాలకు రూ.20 లక్షల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేసిన జగన్.. ఇప్పుడు సీఎం హోదాలో రోడ్డు ప్రమాద మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు ఇచ్చారని లోకేశ్ ఎద్దేవా చేశారు.
ఈ అంశానికి సంబంధించి చిత్తూరు జిల్లా భాకరాపేట రోడ్డు ప్రమాదాన్ని లోకేశ్ ప్రస్తావించారు. భాకరాపేట ప్రమాదంలో చనిపోయిన 9 మంది కుటుంబాలకు రూ.2 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటిస్తూ జగన్ సర్కారు చేసిన ప్రకటనను లోకేశ్ ప్రస్తావించారు. ఈ సందర్భంగా జగన్ మాటలు కోటలు దాటుతాయని, చేతలు మాత్రం తాడేపల్లి ప్యాలెస్ కాంపౌండ్ కూడా దాటవని లోకేశ్ ఎద్దేవా చేశారు.