Telangana: తెలంగాణలో పెరిగిన బస్ పాస్ రేట్లు!.. పెరిగిన ధరలివే!
- పెరిగిన బస్ పాస్ చార్జీలు ఏప్రిల్ 1 నుంచి అమలు
- అన్ని రకాల బస్ పాసుల ధరల పెంపు
- ఆర్డినరీ బస్ పాస్ ధర రూ.1150కి పెంపు
తెలంగాణ ఆర్టీసీ వరుసగా బస్సు చార్జీలను పెంచేసింది. ఇప్పటికే ఓ దఫా బస్సు చార్జీలను పెంచిన ప్రభుత్వం తాజాగా సోమవారం ప్యాసింజర్ సెస్ పేరిట మరోమారు చార్జీలను పెంచేసింది. అదే సమయంలో బస్ పాస్‌ల రేట్లను కూడా పెంచుతున్నట్లుగా ఆర్టీసీ సోమవారం ప్రకటించింది. పెంచిన బస్ పాస్ ధరలు ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తాయని ప్రకటించింది.
పెరిగిన బస్ పాస్ ధరలు ఇలా ఉన్నాయి. ఆర్డినరీ బస్ పాస్ ధర రూ.970 నుంచి రూ.1150కి పెంచిన ఆర్టీసీ.. మెట్రో ఎక్స్‌ప్రెస్ బస్ పాస్ ధరను రూ.1070 నుంచి రూ.1300లకు పెంచింది. మెట్రో డీలక్స్ బస్ పాస్ ధరను రూ.1185 నుంచి రూ.1450కి పెంచగా.. గ్రేటర్ హైదరాబాద్ బస్ పాస్ ధరను రూ.1100 నుంచి రూ.1350కి పెంచింది. పుష్పక్ ఏసీ బస్ పాస్ ధరను రూ.2500ల నుంచి రూ.3000కి పెంచింది.