Pan: పాన్ - ఆధార్ లింక్ చేసుకోకుంటే పడే జరిమానాలు ఇవే..!

Not linking PAN with Aadhaar will cost you Rs 500 in first 3 months Rs 1000 thereafter
  • మార్చి 31తో ముగియనున్న గడువు
  • లింక్ చేయని వారు వెంటనే ఆ పని చేయాలి
  • లేదంటే ఇన్ ఆపరేటివ్ గా పాన్
  • దీంతో ఆర్థిక లావాదేవీల నిర్వహణ కష్టం
ఆర్థిక లావాదేవీలు నిర్వహించే ప్రతి ఒక్కరూ తమ పాన్ ను ఆధార్ తో అనుసంధానం చేసుకోవాలి. మార్చి 31 నాటికి చేసుకోకుంటే జరిమానా చెల్లించాల్సి వస్తుంది. ఈ మేరకు ఒక నోటిఫికేషన్ ను ప్రత్యక్ష పన్నుల కేంద్ర మండలి (సీబీడీటీ) విడుదల చేసింది. 

ఏప్రిల్ 1 నుంచి మూడు నెలల్లోపు ఆధార్ తో పాన్ ను అనుసంధానించుకుంటే రూ.500 జరిమానా చెల్లించాలి. ఏప్రిల్ నుంచి జూన్ చివరికి కూడా లింక్ చేసుకోకపోతే.. ఆ తర్వాత అనుసంధానానికి రూ.1,000 చెల్లించుకోవాలి. ఆధార్ తో పాన్ ను అనుసంధానం చేసుకోకపోతే పెనాల్టీ విధించేందుకు వీలుగా సెక్షన్ 234 హెచ్ ను ఫైనాన్స్ యాక్ట్ లో కేంద్రం చేర్చింది. 

పాన్-ఆధార్ లింక్ చేసుకోకపోతే పెనాల్టీకి అదనంగా ఇతర రూపాల్లోనూ నష్టపోవాల్సి వస్తుంది. లింక్ చేసుకోకపోతే ఇన్ ఆపరేటివ్ అవుతుంది. అప్పుడు ఆర్థిక లావాదేవీల నిర్వహణ సాధ్యపడదు. స్టాక్స్, మ్యూచువల్ ఫండ్స్, ఫిక్స్ డ్ డిపాజిట్లలో ఇన్వెస్ట్ చేసుకోలేరు. బ్యాంకు సేవలకు సైతం అవరోధంగా మారుతుంది. ఇన్ ఆపరేటివ్ అయిపోయి, యాక్టివ్ గా పాన్ లేకపోతే సెక్షన్ 272బీ కింద రూ.10,000 వరకు జరిమానా విధించే అధికారం ఆదాయపన్ను శాఖకు ఉంది.
Pan
Aadhaar
linking
penalty
cbdt

More Telugu News