Andhra Pradesh: ఏపీలో కొత్త జిల్లాలకు కేబినెట్ ఆమోదం
- 13 కొత్త జిల్లాలతో పాటు 22 రెవెన్యూ డివిజన్లు కూడా
- 26కు జిల్లాల సంఖ్య,70కి రెవెన్యూ డివిజన్ల సంఖ్య
- ఏపీ కేబినెట్ ఆమోద ముద్ర
ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించి లాంఛనాలన్నీ వరుసగా జరిగిపోతున్నాయి. ఇప్పటికే బుధవారం ఉదయం కొత్త జిల్లాల అవతరణకు సంబంధించిన సీఎం జగన్ ముహూర్తాన్ని ఖరారు చేయగా.. కాసేపటి క్రితం భేటీ అయిన ఏపీ కేబినెట్ కొత్త జిల్లాలకు ఆమోదం తెలిపింది.
ఈ మేరకు జగన్ నేతృత్వంలో సమావేశమైన ఏపీ కేబినెట్ కొత్తగా ఏర్పాటు కానున్న 13 జిల్లాలతో పాటు 22 కొత్త డివిజన్లకు కూడా ఆమోదం తెలుపుతూ కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో రాష్ట్రంలో కొత్త జిల్లాల సంఖ్య 26కు చేరుకోనుండగా..రెవెన్యూ డివిజన్ల సంఖ్య 70కి చేరనుంది.
కేబినెట్ ఆమోదం తెలిపిన మేరకు ఏపీలో కొత్త జిల్లాల పేర్లు ఇలా ఉన్నాయి.
1. పార్వతీపురం మన్యం జిల్లా
2. అల్లూరి జిల్లా
3. అనకాపల్లి జిల్లా
4. కోనసీమ జిల్లా
5. రాజమండ్రి జిల్లా
6. నరసాపురం జిల్లా
7. బాపట్ల జిల్లా
8. నరసరావుపేట జిల్లా
9. తిరుపతి
10. అన్నమయ్య జిల్లా
11. నంద్యాల జిల్లా
12. సత్యసాయి జిల్లా
13. ఎన్టీఆర్ విజయవాడ జిల్లా