WhatsApp: నేటి నుంచి ఈ స్మార్ట్‌ ఫోన్లలో వాట్సాప్ బంద్!

WhatsApp not work on these phones from March today

  • ఆండ్రాయిడ్ 4.0, అంతకంటే తక్కువ వెర్షన్ ఓఎస్‌లలో సేవల నిలిపివేత
  • ఐఓఎస్ 10, అంతకంటే పై వెర్షన్లకు మాత్రమే అందుబాటులో
  • స్మార్ట్‌ఫోన్ల జాబితా విడుదల

పాత ఓఎస్‌లతో నడిచే స్మార్ట్‌ఫోన్లలో నేటి నుంచి వాట్సాప్ సేవలు నిలిచిపోనున్నాయి. పాత వెర్షన్లకు సేవలను నిలిపివేస్తున్నట్టు ఇది వరకే ప్రకటించిన వాట్సాప్ నేటి నుంచే వాటికి సేవలు బంద్ చేస్తోంది. ఫలితంగా నేటి నుంచి ఆండ్రాయిడ్ 4.0, అంతకంటే తక్కువ ఆపరేటింగ్ సిస్టంతో పనిచేసే స్మార్ట్‌ఫోన్లలో వాట్సాప్ పనిచేయదు. ఇక, యాపిల్ ఐఫోన్ ప్రత్యేక ఓఎస్ అయిన ఐవోఎస్ 10 అంతకంటే పై వెర్షన్లకు మాత్రమే వాట్సాప్ సేవలు అందుబాటులో ఉంటాయి. కాయ్ 2.5 వెర్షన్ కంటే తక్కువ ఉన్న మోడళ్లలోనూ వాట్సాప్ సేవలు ఆగిపోతాయి. 

ఈ క్రమంలో ఏయే ఫోన్లకు సేవలను నిలిపివేస్తున్నదీ వాట్సాప్ ఓ జాబితా కూడా ప్రకటించింది. దాని ప్రకారం.. శాంసంగ్ గెలాక్సీ ట్రెండ్ లైట్, గెలాక్సీ ఎస్ 3 మినీ, గెలాక్సీ ఎక్స్‌కవర్, గెలాక్సీ కోర్ మోడళ్లలోను, ఎల్‌జీ ఆప్టిమస్ సిరీస్‌లో ఎఫ్3 నుంచి ఎఫ్ 7 వరకు, ఆప్టిమస్ ఎల్ 3 II, ఎల్ 4 II డ్యూయల్, ఆప్టిమస్ ఎల్ II, ఎఫ్ 5 II డ్యూయల్ నుంచి ఎఫ్7 II డ్యూయల్‌తోపాటు మరికొన్ని పాత వెర్షన్ ఫోన్లలోనూ సేవలు నేటి నుంచి ఆగిపోనున్నాయి. 

అలాగే, మోటోరోలా డ్రాయిడ్ రాజర్ మోడల్స్‌తో పాటు షావోయి ఎంఐ, హువావే పాత మోడళ్లలో వాట్సాప్ సేవలు నేటి నుంచి నిలిచిపోతాయి. నిజానికి వినియోగదారులు ఎప్పటికప్పుడు కొత్త ఫోన్లకు అప్‌గ్రేడ్ అవుతుండడంతో వాట్సాప్ నిర్ణయ ప్రభావం అతి కొద్దిమందిపై మాత్రమే పడే అవకాశం ఉంది.

  • Loading...

More Telugu News