Tirumala: తిరుమల కొండపై ద్విచక్రవాహనదారులను వెంటాడిన ఏనుగులు

Elephants attack bikers in Tirumala Papavinasam

  • నాలుగు రోజులుగా పాపవినాశంలో తిష్ఠ వేసిన ఏనుగులు
  • ఆకాశగంగ ప్రాంతంలో ద్విచక్రవాహనదారులపై
  • భయంతో బెంబేలెత్తిపోయిన బైకర్లు 

తిరుమల కొండపై గత నాలుగు రోజులుగా ఏనుగులు హల్ చల్ చేస్తున్నాయి. తిరుమల పాపవినాశం ప్రాంతంలో తిష్ఠ వేసిన ఏనుగులు ఆకాశగంగ ప్రాంతంలో రోడ్డుపైకి వచ్చాయి. ఆ మార్గంలో వెళ్తున్న ద్విచక్రవాహనదారులపై దాడికి యత్నించాయి. ఏనుగులను చూసిన బైకర్లు భయంతో బెంబేలెత్తిపోయారు. ఏనుగులు రోడ్డుపైనే ఉండటంతో కాసేపు రాకపోకలు నిలిచిపోయాయి. ఈ నేపథ్యంలో ఏనుగులను అడవిలోకి మళ్లించేందుకు అటవీశాఖ సిబ్బంది విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. 

ఇటీవలి కాలంలో చిత్తూరు జిల్లాలో ఏనుగుల దాడులు ఎక్కువవుతున్నాయి. ఈ మధ్యనే జోగివారిపల్లె గ్రామంలో ఓ రైతును ఏనుగుల మంద చంపేసింది. పొలాలను ఏనుగులు నాశనం చేస్తుండటంతో రైతులు రాత్రి వేళల్లో పొలాల్లో కాపలా కాస్తున్నారు. ఈ క్రమంలో రాత్రిపూట పొలంలో నిద్రిస్తున్న ఎల్లప్ప అనే రైతుపై ఏనుగులు దాడి చేశాయి. దాడిలో గాయపడిన ఎల్లప్ప ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు. ఈ ప్రాంతంలో గత కొన్ని రోజులుగా ఏనుగులు పంటను నాశనం చేయడమే కాకుండా... పొలాల్లోని మోటార్లు, పాకలను కూడా నాశనం చేస్తున్నాయి.

  • Loading...

More Telugu News