Makarand Deshpande: బాహుబలి తర్వాత రాజమౌళి ఆర్ఆర్ఆర్ తీద్దామనుకోలేదు: దేశ్ పాండే

SS Rajamouli didnot want to make RRR after Baahubali
  • చిన్న సినిమా తీయాలన్నది రాజమౌళి ఆలోచన
  • లవ్ స్టోరీ కథనంగా తీద్దామనుకున్నారు
  • భార్య రమా సూచనతో ఆర్ఆర్ఆర్ రాశారు
  • వెల్లడించిన బాలీవుడ్ నటుడు
బాహుబలి అంత భారీ బడ్జెట్ సినిమా తర్వాత రాజమౌళి ఏ ప్రాజెక్టుతో ముందుకు వస్తారో? అన్న ఆసక్తి ప్రేక్షకుల్లోనే కాకుండా, సినిమా పరిశ్రమ వర్గాల్లోనూ అప్పట్లో నెలకొంది. ఆర్ఆర్ఆర్ తో వచ్చి అందరి అంచనాలను ఆయన మార్చేశారు. వాస్తవానికి ఆర్ఆర్ఆర్ సినిమా ఆయన ప్రణాళికల్లోనే లేదు. ఈ విషయాన్ని ఆర్ఆర్ఆర్ సినిమాలో నటించిన బాలీవుడ్ నటుడు మకరంద్ దేశ్ పాండే వెల్లడించారు.

బాహుబలి తర్వాత చిన్న సినిమా తీయాలన్నది రాజమౌళి ఆలోచనగా పాండే తెలిపారు. అది కూడా లవ్ స్టోరీతో కూడినది. కానీ, రాజమౌళి భార్య రమా సూచనతో ఆయన ఆలోచన మార్చుకున్నారు. 2009లో మగధీరతో భారీ హిట్ చూసిన రాజమౌళి.. 2010లో తక్కువ బడ్జెట్ తో సునీల్ ప్రధాన పాత్రధారిగా మర్యాద రామన్న సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడం తెసిందే. రమా రాజమౌళి జోక్యం చేసుకోకపోయి ఉంటే.. ఈ సారి కూడా అదే ట్రెండ్ తో మర్యాద రామన్న తరహాలో చిన్న చిత్రంతో రాజమౌళి అలరించి ఉండేవారు. 

‘‘మీరు ఏది ఉత్తమంగా చేయగలరో దానినే చేపట్టండి’’అంటూ రమా తన భర్తకు సూచించినట్టు దేశ్ పాండే వెల్లడించారు. దాంతో రాజమౌళి ఆర్ఆర్ఆర్ ను తీసుకున్నట్టు చెప్పారు. ‘‘ ఈ విషయాన్ని రాజమౌళి గారు నాతో చెప్పినప్పుడు.. ఆయన పెద్దగా ఆలోచిస్తారు. బాగా కష్టపడి పనిచేస్తారని అర్థం చేసుకున్నాను. ఆర్ఆర్ఆర్ తుపాను సృష్టిస్తోంది. బాహుబలితో యావత్ దేశాన్ని తన ప్రేక్షకులుగా ఆయన మలుచుకున్నారు’’ అని దేశ్ పాండే పేర్కొన్నారు.
Makarand Deshpande
RRR
SS Rajamouli
Baahubali

More Telugu News