Ayyanna Patrudu: ఉగాది కానుకగా విద్యుత్ ఛార్జీల మోత మోగించారు: అయ్యన్నపాత్రుడు విమర్శలు
- ద, మధ్య తరగతి ప్రజలకు ఇది పెనుభారం
- పేద వారిపై రూ. 1,400 కోట్ల భారం పడుతుంది
- చెత్త, మరుగుదొడ్లపై పన్ను వేసిన ఘనత జగన్ దన్న అయ్యన్న
ఏపీ ముఖ్యమంత్రి జగన్ పై టీడీపీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఉగాది కానుకగా పేద, మధ్య తరగతి ప్రజలపై విద్యుత్ ఛార్జీల మోత మోగించారని విమర్శించారు. పేద, మధ్య తరగతి ప్రజలకు ఇది పెనుభారంగా మారుతుందని అన్నారు. అధికారంలోకి వస్తే విద్యుత్ ఛార్జీలను పెంచనని హామీ ఇచ్చిన జగన్.. ఇప్పటి వరకు ఏడు సార్లు ఛార్జీలు పెంచారని దుయ్యబట్టారు. జగన్ కు పిచ్చి ముదిరిందని అన్నారు. మీరు కానీ, మీ ఎమ్మెల్యేలు కానీ జనాల్లోకి వెళ్తే బాదుతారని చెప్పారు.
విద్యుత్ ఛార్జీల పెంపు వల్ల పేదవారిపై రూ. 1,400 కోట్ల భారం పడుతుందని అయ్యన్నపాత్రుడు అన్నారు. దేశంలో అన్ని రాష్ట్రాల కంటే ఎక్కువ పెట్రోల్ ధరలున్నది ఏపీలోనే అని చెప్పారు. చెత్త, మరుగుదొడ్లపై కూడా పన్ను వేసిన ఘనత జగన్ దేనని దుయ్యబట్టారు. రానున్న ఎన్నికల్లో వైసీపీని తరిమికొట్టకపోతే... మన పిల్లలకు భవిష్యత్ ఉండదని అన్నారు.