Russia: రష్యాపై ఉక్రెయిన్ దాడులు.. చమురు డిపో ధ్వంసం
- రష్యాలోని చమురు డిపోపై ఉక్రెయిన్ దాడి
- బెల్గోరడ్ గవర్నర్ వ్యాచెస్లావ్ గ్లాడ్కోవ్ వెల్లడి
- చమురు డిపోలో పేలుడు, అగ్ని ప్రమాద ఫొటోలు విడుదల
- ఇంకా స్పందించని ఉక్రెయిన్
తాజాగా రష్యాపై ఉక్రెయిన్ బలగాలు దాడికి దిగాయన్న వార్త ఆసక్తి రేకెత్తిస్తోంది. ఇరు దేశాల సరిహద్దుకు సమీపంలో ఉన్న రష్యాకు చెందిన చమురు డిపో లక్ష్యంగా ఉక్రెయిన్ హెలికాప్టర్లతో దాడి చేసిందట. ఈ దాడిలో చమురు డిపోలో మంటలు చెలరేగాయి. అక్కడ విధుల్లో ఉన్న ఇద్దరు వ్యక్తులు కూడా గాయపడ్డారు.
ఈ విషయాన్ని రష్యాలోని బెల్గోరడ్ గవర్నర్ వ్యాచెస్లావ్ గ్లాడ్కోవ్ స్వయంగా తెలిపారు. ఇరు దేశాల మధ్య సరిహద్దుకు ఉక్రెయిన్ దాడి చేసిన చమురు డిపో కేవలం 30 కిలో మీటర్ల దూరంలోనే ఉంటుందట. ఉక్రెయిన్ ప్రధాన నగరం ఖర్కివ్కు ఉత్తరాన ఉన్న ఈ చమురు డిపోలో పేలుడు, అగ్ని కీలలకు సంబంధించిన ఫొటోలను రష్యా విడుదల చేసింది. ఈ వార్తలపై ఉక్రెయిన్ ఇంకా ఎలాంటి స్పందన తెలియజేయలేదు.