Randhir Kapoor: రిషికపూర్ చనిపోయిన విషయం కూడా గుర్తు లేదు.. అల్జీమర్స్ తో బాధపడుతున్న కరీనా కపూర్ తండ్రి!
- రణధీర్ కపూర్ కు అల్జీమర్స్ తొలిదశలో ఉందన్న రణ్ బీర్ కపూర్
- నాన్న చనిపోయిన విషయాన్ని కూడా మర్చిపోయారని వ్యాఖ్య
- నాన్నతో ఫోన్ లో మాట్లాడతానని అడిగారన్న రణ్ బీర్
ప్రముఖ బాలీవుడ్ నటి కరీనా కపూర్ తండ్రి రణధీర్ కపూర్ మతిమరుపు వ్యాధితో బాధపడుతున్నారు. అయితే ఆయనకు ఈ వ్యాధి ప్రారంభ దశలోనే ఉంది. ఈ విషయాన్ని కరీనా కపూర్ కజిన్, హీరో రణ్ బీర్ కపూర్ వెల్లడించాడు.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో రణ్ బీర్ మాట్లాడుతూ, 'శర్మాజీ నమ్ కీన్' చిత్రాన్ని ఇటీవల రణధీర్ అంకుల్ చూశారని.. సినిమా చూసిన తర్వాత తన దగ్గరకు వచ్చి, ఈ సినిమాలో మీ నాన్న (రిషి కపూర్) అద్భుతంగా నటించాడని, నేను అతనితో మాట్లాడాలి ఫోన్ చెయ్ అని అడిగారని చెప్పాడు. నాన్న చనిపోయిన సంగతిని కూడా అంకుల్ మర్చిపోయారని తెలిపారు. బాలీవుడ్ దిగ్గజం రాజ్ కపూర్ కు రణధీర్ కపూర్, రిషి కపూర్, రాజీవ్ కపూర్ లు కుమారులు అనే విషయం తెలిసిందే. రణ్ బీర్ తండ్రి రిషికపూర్ రెండేళ్ల క్రితం చనిపోయారు.