Balakrishna: మంచి మనిషిని, ఆప్తుడిని కోల్పోయాను: బాలకృష్ణ

Balakrishna pays condolences to Director Sharath
  • ఈ ఉదయం తుదిశ్వాస విడిచిన శరత్
  • పరిశ్రమలో మంచి పేరు తెచ్చుకున్నారన్న బాలయ్య
  • ఆయన మరణ వార్త బాధించిందని వ్యాఖ్య
ప్రముఖ సినీ దర్శకుడు శరత్ తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. క్యాన్సర్ తో బాధపడుతున్న ఆయన ఈ ఉదయం ఇంట్లోనే కన్నుమూశారు. ఆయన మృతి పట్ల సినీ ప్రముఖులు సంతాపాన్ని తెలియజేస్తున్నారు. శరత్ మృతి పట్ల ప్రముఖ హీరో బాలకృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు.

 మంచి దర్శకుడిని, ఆప్తుడిని కోల్పోయామని ఆయన అన్నారు. తనకు ఆయన ఎంతో ఆప్తుడని చెప్పారు. పరిశ్రమలో మంచి మనిషిగా పేరు తెచ్చుకున్నారని తెలిపారు. ఆయనతో తాను 'వంశానికొక్కడు', 'పెద్దన్నయ్య', 'సుల్తాన్','వంశోద్ధారకుడు' సినిమాలు చేశానని చెప్పారు. ఆయన మరణవార్త తనను బాధించిందని అన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నానని... వారి కుటుంబానికి సానుభూతిని తెలియజేస్తున్నానని అన్నారు.
Balakrishna
Sharath
Tollywood
Condolences

More Telugu News