Sensex: భారీ లాభాల్లో ముగిసిన మార్కెట్లు
- 708 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్
- 223 పాయింట్లు లాభపడ్డ నిఫ్టీ
- 6 శాతం వరకు పెరిగిన ఎన్టీపీసీ షేరు విలువ
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు భారీ లాభాల్లో ముగిశాయి. ఈ ఉదయం ట్రేడింగ్ ప్రారంభమైనప్పటి నుంచి మార్కెట్లు పైకి ఎగబాకుతూనే వచ్చాయి. ఈ క్రమంలో ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 708 పాయింట్లు పెరిగి 59,276కి చేరుకుంది. నిఫ్టీ 223 పాయింట్లు లాభపడి 17,670కి పెరిగింది. ఈరోజు అన్ని సూచీలు లాభపడ్డాయి. యుటిలిటీస్, పవర్, పీఎస్యూ సూచీలు 3 శాతానికి పైగా పెరిగాయి.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
ఎన్టీపీసీ (5.97%), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (3.90%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (3.20%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (3.10%), హెచ్డీఎఫ్సీ లిమిటెడ్ (2.95%).
టాప్ లూజర్స్:
టెక్ మహీంద్రా (-0.74%), డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్ (-0.59%), టైటాన్ (-0.44%), సన్ ఫార్మా (-0.36%), ఇన్ఫోసిస్ (-0.18%).