Uber: ఇంధ‌న ధ‌ర‌ల దెబ్బ‌.. 15 శాతం రేట్ల‌ను పెంచేసిన ఉబెర్‌

uber hikes its fares 15 percent in mumbai

  • రోజూ పెరుగుతున్న ఇంధ‌న ధ‌ర‌లు
  • ఆ కార‌ణంగానే రేట్లు పెంచుతున్నామ‌న్న ఉబెర్‌
  • ప్ర‌స్తుతం ఈ పెంపు ముంబైకి మాత్ర‌మే ప‌రిమితం

ఉక్రెయిన్, ర‌ష్యాల మ‌ధ్య జ‌రుగుతున్న యుద్ధం నేప‌థ్యంలో అంత‌ర్జాతీయంగా ముడి చ‌మురు ధ‌ర‌లు పెర‌గ‌డం, దాని ఆధారంగా దేశంలో ఇంధ‌న ధ‌ర‌లు పెరిగిపోతున్నాయి. ఈ ఫ‌లితంగా నిత్యావ‌స‌ర ధ‌ర‌లూ ఆకాశాన్నంటే ప‌రిస్థితులు క‌నిపిస్తున్నాయి. ఇలాంటి త‌రుణంలో క్యాబ్ సేవ‌ల్లో ప్ర‌ముఖ సంస్థ‌గా పేరొందిన ఉబెర్ త‌న రేట్ల‌ను పెంచేసింది. ప్ర‌స్తుతం ఉన్న ధ‌ర‌ల‌కు అద‌నంగా 15 శాతాన్ని జోడిస్తున్న‌ట్లుగా ఆ సంస్థ పేర్కొంది.

అయితే ఈ పెరిగిన ధ‌ర‌లు ముంబైకి మాత్ర‌మేన‌ని ఉబెర్ తెలిపింది. పెరిగిన పెట్రోల్, డీజిల్ ధ‌ర‌ల‌కు అనుగుణంగానే త‌మ సేవ‌ల రేట్ల‌ను పెంచుతున్న‌ట్లుగా ఉబెర్ ప్ర‌క‌టించింది. ఉబెర్ ప్ర‌క‌ట‌న చూస్తుంటే.. త్వ‌ర‌లోనే ఈ పెంచిన రేట్ల‌ను దేశ‌వ్యాప్తంగా అమ‌లు చేసేందుకు ఆ సంస్థ ఏమాత్రం వెనుకంజ వేయ‌ద‌న్న వాద‌న‌లు వినిపిస్తున్నాయి.

  • Loading...

More Telugu News