BCCI: 28 ఏళ్ల తర్వాత చరిత్ర పునరావృతం అయ్యి నేటికి 11 ఏళ్లు.. బీసీసీఐ పోస్ట్
- 1983లో కప్ నెగ్గిన భారత జట్టు
- 28 ఏళ్ల తర్వాత తిరిగి విజేతగా నిలిచిన వైనం
- రెండో విజయానికి నేటితో సరిగ్గా 11 ఏళ్లు
- మధుర జ్ఞాపకాన్ని గుర్తు చేసిన బీసీసీఐ
1983లో కపిల్ దేవ్ నేతృత్వంలోని టీమిండియా వన్డే వరల్డ్ కప్‌ను గెలిచింది. ఆ తర్వాత తిరిగి ఆ టోర్నీలో భారత్ విజేతగా నిలిచేందుకు ఏకంగా 28 ఏళ్లు పట్టింది. అలా 28 ఏళ్ల తర్వాత భారత క్రికెట్ జట్టు చరిత్రను తిరగా రాసి నేటికి సరిగ్గా 11 ఏళ్లు అవుతోంది. 2011లో భారత క్రికెట్ జట్టు రెండో పర్యాయం విజేతగా నిలిచింది. ఈ దఫా భారత జట్టుకు కెప్టెన్ కూల్ మహేంద్ర సింగ్ ధోనీ నాయకత్వం వహించాడు.
2011లో జరిగిన వన్డే వరల్డ్ కప్‌లో సరిగ్గా ఏప్రిల్ 2వ తేదీన ముంబైలోని వాంఖడే స్టేడియంలో శ్రీలంక జట్టుతో టీమిండియా టైటిల్ బరిలోకి దిగింది. ఈ మ్యాచ్‌లో శ్రీలంక తొలుత బ్యాటింగ్ చేయగా.. లక్ష్య ఛేదనలో భారత్ తడబడ్డా.. కెప్టెన్ కీలక ఇన్నింగ్స్‌తో పాటు సిక్స్‌తో మ్యాచ్‌ను ముగించి టైటిల్ ను చేజిక్కించుకున్న క్షణాలను భారతీయులు ఇప్పటికీ మరిచిపోలేదు. ఇదే అంశాన్ని ప్రస్తావిస్తూ బీసీసీఐ నాటి విజేత జట్టు ఫొటోను ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేసింది.