BJP: జిన్నా ట‌వ‌ర్ పేరు మార్చాల్సిందే.. బీజేపీ ఏపీ చీఫ్ సోము వీర్రాజు డిమాండ్‌

somu veerraju comments on jinna tower in guntur
  • విజ‌య‌వాడ‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాల‌యంలో ఉగాది వేడుక‌లు
  • హాజ‌రైన రాష్ట్ర అధ్య‌క్షుడు సోము వీర్రాజు
  • జిన్నా ట‌వ‌ర్ పేరు మార్చేదాకా ఆందోళ‌న‌లేన‌ని హెచ్చరిక‌
గుంటూరులోని జిన్నా ట‌వ‌ర్ పేరు మార్చాల్సిందేన‌ని బీజేపీ ఏపీ శాఖ అధ్య‌క్షుడు సోము వీర్రాజు డిమాండ్ చేశారు. శ‌నివారం తెలుగు సంవ‌త్స‌రాది ఉగాదిని పుర‌స్క‌రించుకుని విజ‌యవాడ‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాల‌యంలో నిర్వ‌హించిన ఉగాది వేడుక‌ల‌కు ఆయ‌న ముఖ్య అతిథిగా హాజ‌ర‌య్యారు.ఈ సంద‌ర్భంగా రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు ఉగాది శుభాకాంక్ష‌లు తెలిపిన వీర్రాజు..ప‌లు అంశాల‌పై కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. 

గుంటూరులోని జిన్నా ట‌వ‌ర్ పేరు మార్చాల్సిందేన‌ని ఆయ‌న ఏపీ ప్ర‌భుత్వాన్ని డిమాండ్ చేశారు. జిన్నా ట‌వ‌ర్ పేరు మార్చేదాకా త‌మ పార్టీ యువ‌జ‌న విభాగం బీజేవైఎం నిర‌స‌న‌లుఏ కొన‌సాగిస్తుంద‌ని ఆయ‌న హెచ్చ‌రించారు. ఈ నెల 4న గుంటూరులో జ‌ర‌గ‌నున్న పార్టీ స‌మావేశంలో ఈ నిర‌స‌న‌లకు సంబంధించిన కార్యాచ‌ర‌ణ‌ను ప్ర‌క‌టిస్తామ‌ని ఆయ‌న చెప్పారు.
BJP
Somu Veerraju
JInna Tower
Guntur
BJYM]

More Telugu News