Anasuya: మగజాతి పరువు తీస్తున్నారు: యాంకర్ అనసూయ ఫైర్

Anchor Anasuya fires on netizen
  • అనసూయ డ్రెస్సింగ్ పై కామెంట్ చేసిన నెటిజన్
  • పొట్టి దుస్తులు ధరిస్తూ తెలుగు ఆడపడుచుల పరువు తీస్తున్నారని విమర్శ
  • మీ పని మీరు చేసుకోండని మండిపడ్డ అనసూయ
ప్రముఖ బుల్లితెర యాంకర్, సినీ నటి అనసూయ తన డ్రెస్సింగ్ విషయంలో తరచుగా నెటిజన్ల నుంచి విమర్శలు ఎదుర్కొంటుంటుంది. తాజాగా మరోసారి ఆమెకు అలాంటి అనుభవమే ఎదురైంది. గతంలో అనసూయ వేసుకున్న ఒక పొట్టి డ్రస్సుపై ఓ నెటిజన్ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశాడు. 

ఇద్దరు పిల్లల తల్లి అయిన మీరు, ఇలాంటి పొట్టి దుస్తులు ధరిస్తూ, తెలుగు ఆడపడుచుల పరువు తీస్తున్నారని విమర్శించాడు. ఈ వ్యాఖ్యలపై అనసూయ ఘాటుగా స్పందించింది. 'దయచేసి మీరు మీ పనిని చూసుకోండి. నన్ను నా పనిని చేసుకోనివ్వండి. మీరు ఇలా ఆలోచించి మగజాతి పరువు తీస్తున్నారు' అని ఆగ్రహం వ్యక్తం చేసింది.
Anasuya
Tollywood
Dressing

More Telugu News