Piyush Goyal: 'ఆర్ఆర్ఆర్' సినిమా కలెక్షన్లను ప్రస్తావించిన కేంద్రమంత్రి పియూష్ గోయల్

Union minister Piyush Goyal talks about RRR movie collections
  • ఆర్ఆర్ఆర్ పేరు ఎక్కువగా వినిపిస్తోందన్న గోయల్
  • రూ.750 కోట్లు వసూలు చేసిందని వెల్లడి
  • భారతదేశం కూడా ఆర్ఆర్ఆర్ లానే దూసుకెళుతోందని వివరణ
  • మోదీ నాయకత్వంలో లక్ష్యాలను సాధిస్తోందని వ్యాఖ్యలు
ఆర్ఆర్ఆర్.... రాజమౌళి, రామ్ చరణ్, ఎన్టీఆర్ కలయికలో వచ్చిన ఈ చిత్రం దేశవ్యాప్తంగా కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. కాగా, కేంద్రమంత్రి పియూష్ గోయల్ తన ప్రసంగంలో ఆర్ఆర్ఆర్ చిత్రం గురించి ప్రస్తావించడం ఆ సినిమా మేనియా ఎలాంటిదో చెబుతోంది. 

పియూష్ గోయల్ మాట్లాడుతూ "ఇటీవల ఆర్ఆర్ఆర్ మూవీ పేరు ఎక్కువగా వినిపిస్తోంది. ఇప్పటివరకు భారతీయ సినీ చరిత్రలో ఇదే అతిపెద్ద హిట్ చిత్రం అవుతుందని తెలిసింది. ఈ చిత్రం రూ.750 కోట్ల దాకా రాబట్టింది. ఆర్ఆర్ఆర్ చిత్రంలాగే భారత ఆర్థిక వ్యవస్థ కూడా దూసుకుపోతోంది. రికార్డుల మీద రికార్డులు బద్దలు కొడుతోంది. ప్రధాని మోదీ నాయకత్వంలో దేశంలో అనేక భారీ లక్ష్యాలను నిర్దేశించుకోవడమే కాదు, వాటిని అందుకునే సామర్థ్యం కూడా దేశం సొంతం చేసుకుంటోంది" అని వివరించారు.
Piyush Goyal
RRR
Collections
India
Rajamouli
Junior NTR
Ramcharan
Tollywood

More Telugu News