Amit Shah: నా వాయిస్ హై పిచ్ లో ఉంటుంది.. మాన్యుఫాక్చరింగ్ డిఫెక్ట్: నవ్వులు పూయించిన అమిత్ షా

My high pitched voice is manufacturing defect says Amit Shah
  • అమిత్ షాకు కోపం ఎక్కువన్న విపక్ష నేతలు
  • తనకు అసలు కోపమే రాదన్న అమిత్ షా
  • కశ్మీర్ కు సంబంధించిన ప్రశ్నలు అడిగితే మాత్రం కోపం వస్తుందని వ్యాఖ్య
కేంద్ర హోం మంత్రి అమిత్ షా నిన్న లోక్ సభలో చేసిన వ్యాఖ్యలు నవ్వులు పూయించాయి. తన వాయిస్ హై పిచ్ లో ఉంటుందని, అందుకే తాను మాట్లాడితే చాలా గట్టిగా మాట్లాడినట్టు ఉంటుందని ఆయన అన్నారు. తన మాటతీరే అంతని... దాన్ని ఆగ్రహం అనుకోవద్దని చెప్పారు. తాను ఎవరినీ తిట్టనని అన్నారు. తన గొంతు హైపిచ్ లో ఉండటానికి కారణం... మాన్యుఫాక్చరింగ్ డిఫెక్ట్ అని చమత్కరించారు. ఆయన వ్యాఖ్యలతో సభలో ఉన్న సభ్యుల్లో కొందరు చిరు నవ్వులు చిందించగా... మరి కొందరు గట్టిగా నవ్వేశారు. 

తనకు అస్సలు కోపమే రాదని... అయితే కశ్మీర్ కు సంబంధించిన ప్రశ్నలు అడితే మాత్రం కోపం వస్తుందని అమిత్ షా అన్నారు. క్రిమినల్ ప్రొసీజర్ బిల్ 2022ని సభలో మూవ్ చేస్తున్న సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అమిత్ షాకు కోపం ఎక్కువని విపక్ష నేతలు చేసిన కామెంట్ కు సమాధానంగా ఆయన ఈ మేరకు వ్యాఖ్యానించారు. నేర విచారణ మరింత సమర్థవంతంగా జరగాలనే లక్ష్యంతో ఈ బిల్లును ప్రవేశ పెడుతున్నామని చెప్పారు.
Amit Shah
BJP
Lok Sabha
Voice
Anger

More Telugu News