YSRCP: అప్పు చెల్లించ‌మంటే.. సొంత పార్టీ మహిళా కౌన్సిల‌ర్‌పై వైసీపీ ఎమ్మెల్యే అనుచ‌రుల‌ దాడి

ysrcp counseller allegations on own party mla

  • కౌన్సిల‌ర్ వ‌ద్ద రూ.1.5 కోట్లు అప్పుగా తీసుకున్న ఎమ్మెల్యే
  • రూ.90 ల‌క్ష‌లు మాత్రమే తిరిగి చెల్లించిన వైనం
  • మిగిలిన డ‌బ్బు అడిగితే అనుచ‌రు‌ల‌తో దాడి చేయించారానంటున్న ‌కౌన్సిలర్ 
  • క‌ల్యాణదుర్గం ఎమ్మెల్యేపై సొంత పార్టీ మహిళా కౌన్సిల‌ర్ ఆరోప‌ణ‌లు

ఏపీలోని అధికార పార్టీ వైసీపీకి చెందిన మ‌హిళా ఎమ్మెల్యే ఉషాశ్రీ చ‌ర‌ణ్‌పై సొంత పార్టీ మ‌హిళా కౌన్సిల‌ర్ బుధ‌వారం తీవ్ర ఆరోప‌ణ‌లు చేశారు. త‌న వ‌ద్ద అప్పు తీసుకున్న ఎమ్మెల్యే... అప్పు చెల్లించ‌మ‌ని అడిగిన త‌న‌ను త‌న అనుచ‌రుల‌తో కొట్టించార‌ని కౌన్సిలర్ ఆరోపించారు. ఈ వ్య‌వ‌హారం ఇప్పుడు వైసీపీలో క‌ల‌క‌లం రేపుతోంది. 

బాధితురాలు క‌ల్యాణ‌దుర్గం కౌన్సిల‌ర్ ప్ర‌భావ‌తి చేసిన ఆరోప‌ణ‌ల ప్ర‌కారం, ఈ వివాదం  వివ‌రాలు ఇలా ఉన్నాయి. అనంత‌పురం జిల్లా క‌ల్యాణ‌దుర్గం ఎమ్మెల్యేగా ఉషాశ్రీ చ‌ర‌ణ్ కొన‌సాగుతున్న సంగ‌తి తెలిసిందే. క‌ల్యాణ‌దుర్గం మునిసిప‌ల్ కౌన్సిల‌ర్‌గా ఉన్న వైసీపీ మ‌హిళా నాయ‌కురాలు ప్ర‌భావ‌తి వ‌ద్ద నుంచి ఉషాశ్రీ చ‌ర‌ణ్ రూ.1.5 కోట్ల‌ను అప్పుగా తీసుకున్నారు‌.

తర్వాత అందులో రూ.90 ల‌క్ష‌ల‌ను తిరిగి ఇచ్చేసిన ఎమ్మెల్యే మిగిలిన డ‌బ్బును చెల్లించ‌లేదు‌. దీంతో బ‌కాయి కోసం కౌన్సిల‌ర్ అడిగితే.. ఎమ్మెల్యే ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేశారట. అంతేకాకుండా నన్నే నిలదీస్తావా? అంటూ ఆగ్ర‌హంతో త‌న అనుచ‌రుల‌తో లేడీ కౌన్సిల‌ర్‌పై ఎమ్మెల్యే దాడి చేయించారు‌. ఈ దాడి మునిసిప‌ల్ కార్యాల‌యంలోనే జరిగిందని కౌన్సిలర్ ఆరోపిస్తున్నారు.

  • Loading...

More Telugu News