Balineni Srinivasa Reddy: చంద్రబాబు వల్లే ఇప్పుడు విద్యుత్ చార్జీలు పెంచాల్సి వచ్చింది: ఏపీ మంత్రి బాలినేని

Power charges hiked because of Chandrababu said minister balineni
  • చంద్రబాబు హయాంలో రూ. 68 వేల కోట్ల అప్పులు
  • తప్పనిసరి పరిస్థితుల్లోనే స్వల్పంగా పెంచాల్సి వచ్చిందన్న మంత్రి 
  • పవన్‌తో పొత్తు కోసం చంద్రబాబు తపిస్తున్నారని వ్యాఖ్య 
చంద్రబాబు ప్రభుత్వ హయాంలో చేసిన రూ. 68 వేల కోట్ల అప్పుల కారణంగానే ఇప్పుడు విద్యుత్ చార్జీలు పెంచాల్సి వచ్చిందని ఏపీ విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. తమ ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని, తప్పనిసరి పరిస్థితుల్లోనే విద్యుత్ చార్జీలను స్వల్పంగా పెంచాల్సి వచ్చిందని అన్నారు. ప్రజలను ఇబ్బంది పెట్టాలన్న ఆలోచన తమకు లేదన్నారు.

రాజకీయాల్లో 40 ఏళ్ల అనుభవం ఉన్న చంద్రబాబు పొత్తు లేకుండా ఏనాడూ గెలవలేదని, ఈసారి పవన్‌తో పొత్తు కోసం వెంపర్లాడుతున్నారని విమర్శించారు. పనిలో పనిగా జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పైనా విమర్శలు చేశారు. ఇంతకీ ఆయన ముఖ్యమంత్రి అభ్యర్థా? కాదా? అన్న విషయాన్ని స్పష్టం చేయాలని మంత్రి బాలినేని డిమాండ్ చేశారు.
Balineni Srinivasa Reddy
Power Charges
Chandrababu
YSRCP
Pawan Kalyan

More Telugu News