Aligarh Muslim University: పురాణాల్లోనూ అత్యాచారాలున్నాయంటూ పాఠాలు చెప్పిన ప్రొఫెసర్ క్షమాపణ

Aligarh Muslim University professor apologises for mythical references on rape in class
  • అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీలో ఘటన
  • ఎంబీబీఎస్ విద్యార్థులకు ‘లైంగిక నేరాలు’పై బోధన
  • పురాణాల్లోని ఇతివృత్తాల ప్రస్తావన
  • షోకాజు నోటీసు ఇచ్చిన యూనివర్సిటీ
పురాణాల్లోనూ అత్యాచార ఉదంతాలు ఉన్నాయంటూ వైద్య విద్యార్థులకు పాఠాలు చెప్పిన అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ ప్రొఫెసర్ క్షమాపణలు చెప్పారు. లైంగిక నేరాలు అనే అంశంపై ఎంబీబీఎస్ మూడో సంవత్సరం విద్యార్థులకు డాక్టర్ జితేష్ కుమార్ ఇటీవల ఓ పాఠం చెప్పారు. అందులో భాగంగా ఓ కంప్యూటర్ స్లైడ్ చూపిస్తూ హిందూ దేవతలను ప్రస్తావించారు. పురాణాల్లోని అత్యాచార ఉదంతాలను ప్రస్తావించారు. దీంతో యూనివర్సిటీ సదరు ప్రొఫెసర్ కు షోకాజు నోటీసులు జారీ చేసింది.

‘‘పురాణాల్లో అత్యాచారం అనే కంటెంట్ ను అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ యాజమాన్యం, ఫ్యాకల్టీ తీవ్రంగా ఖండించింది. విద్యార్థులు, సిబ్బంది, పౌరుల మత మనోభావాలను గాయపరిచినందుకు డాక్టర్ జితేంద్ర కుమార్ కు షోకాజు నోటీసు జారీ చేయడం జరిగింది’’ అంటూ యూనివర్సిటీ ఓ ప్రకటన విడుదల చేసింది.

దీనికి సదరు ప్రొఫెసర్ స్పందిస్తూ.. మతానికి సంబంధించిన మనోభావాలను గాయపరచడం తన ఉద్దేశ్యం కాదంటూ బేషరతు క్షమాపణ చెప్పారు. అత్యాచారాలు మన సమాజంలో ఎప్పటి నుంచో ఉన్నాయని చెప్పడమే తన ఉద్దేశ్యమని, ఈ విషయంలో తన వైపు నుంచి తప్పిదం చోటు చేసుకున్నట్టు లిఖితపూర్వకంగా యూనివర్సిటీకి క్షమాపణ లేఖను సమర్పించారు. 
Aligarh Muslim University
professor
apologises
rapes
mythical

More Telugu News