IPL 2020: 'కమిన్స్ ఆడిన తీరు నమ్మలేకపోతున్నాం'.. రోహిత్ శర్మ, శ్రేయస్ అయ్యర్ ప్రశంసల జల్లు
- మ్యాచ్‌ను గెలిపించిన క్రెడిట్ మొత్తం కమిన్స్‌కే దక్కుతుందన్న రోహిత్
- నెట్స్‌లో బ్యాటింగ్ సాధన చేస్తోన్న సమయంలో పదేపదే బౌల్డ్ అయ్యాడన్న శ్రేయాస్
- బంతి టైమింగ్‌ని బట్టి షాట్లు ఆడాలని చెప్పానని వెల్లడి
గత రాత్రి కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై జట్టు ఓడిపోయిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో కోల్‌కతా పేసర్ ప్యాట్ కమిన్స్ 56 పరుగులు చేసి జట్టును గెలిపించండంతో అతనిపై ప్రశంసల జల్లు కురుస్తోంది.
ముంబై జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ ఈ విషయంపై మాట్లాడుతూ... కమిన్స్ ఇలా ఆడతాడని ఎన్నడూ ఊహించలేదని చెప్పాడు. ఈ మ్యాచ్‌ను గెలిపించిన క్రెడిట్ మొత్తం కమిన్స్‌కే దక్కుతుందని తెలిపాడు. బ్యాట్స్‌మెన్ బాగా ఆడేందుకు అనుకూలంగా పిచ్ ఉందని, అయితే, తాము బ్యాటింగ్‌లో తొలుత సరిగ్గా ఆడలేకపోయామని తెలిపాడు. అయినప్పటికీ చివరి 5 ఓవర్లలో 70కి పైగా పరుగులు సాధించామని అన్నాడు.
తమ బ్యాట్స్‌మెన్ ఆ సమయంలో ఆడిన తీరు బాగుందని చెప్పాడు. బౌలింగ్‌లో మాత్రం తమ ప్రణాళికల పరంగా రాణించలేకపోయామని అన్నాడు. కోల్‌కతా బ్యాటింగ్ చేస్తోన్న సమయంలో మొదట పరిస్థితులు తమకే అనుకూలంగా ఉన్నాయని, అయితే, కమిన్స్ వచ్చి చెలరేగి ఆడాడని చెప్పాడు. వెంకటేశ్, కమిన్స్‌లను ఔట్ చేయలేకపోవడంతో ఓడిపోయామని అన్నాడు. ఈ ఓటమిని జీర్ణించుకోవడం చాలా కష్టమని తెలిపాడు.
ఇదే విషయంపై కోల్‌కతా కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ మాట్లాడుతూ.. కమిన్స్ పై ప్రశంసలు కురిపించాడు. అతను ఆడిన తీరును నమ్మలేకపోతున్నానని తెలిపాడు. నెట్స్‌లో బ్యాటింగ్ సాధన చేస్తోన్న సమయంలో అతడు పదేపదే బౌల్డ్ అయ్యాడని గుర్తు చేసుకున్నాడు. ఆ సమయంలో తాను కమిన్స్ పక్కనే ప్రాక్టీస్ చేసినట్లు తెలిపాడు. కమిన్స్ ప్రతి బంతిని బలంగా కొట్టాలని భావించేవాడని, అయితే, బంతి టైమింగ్‌ని బట్టి షాట్లు ఆడాలని తాను అతనికి చెప్పానని అన్నాడు. మ్యాచ్‌లో మాత్రం ఔట్ కాకుండా కమిన్స్ ఆడిన తీరు అద్భుతంగా ఉందని చెప్పాడు.