AP Cabinet: మంత్రుల రాజీనామాపై దేవినేని ఉమ ఘాటు స్పంద‌న‌

devineni uma comments on ap ministers resignations
  • రాజీనామా చేసిన వారు అస‌మ‌ర్థుల‌న్న దేవినేని
  • సీఎం జ‌గ‌న్ రాజీనామాకు డిమాండ్‌
  • సీఎంగా మ‌రొక‌రికి అవ‌కాశం క‌ల్పించాల‌న్న మాజీ మంత్రి
ఏపీ కేబినెట్‌లోని మొత్తం 24 మంది మంత్రుల రాజీనామాల‌పై టీడీపీ సీనియ‌ర్ నేత‌, మాజీ మంత్రి దేవినేని ఉమామ‌హేశ్వ‌ర‌రావు ఘాటుగా స్పందించారు. జ‌గ‌న్ కేబినెట్‌లోని 24 మంది అస‌మ‌ర్థులు త‌మ మంత్రి ప‌ద‌వుల‌కు రాజీనామాలు చేశార‌ని ఆయ‌న వ్యాఖ్యానించారు. అదే స‌మ‌యంలో దేవినేని ఓ కొత్త డిమాండ్ వినిపించారు. మంత్రుల మాదిరే సీఎం జ‌గన్ కూడా తన ప‌ద‌వికి రాజీనామా చేయాల‌ని డిమాండ్ చేసిన దేవినేని.. మంత్రులుగా ఇత‌రుల‌కు ఎలా అయితే అవ‌కాశం క‌ల్పిస్తున్నారో,  సీఎంగా కూడా మ‌రొక‌రికి అవ‌కాశం క‌ల్పించాల‌ని సూచించారు.
AP Cabinet
TDP
Devineni Uma

More Telugu News