cardless: కార్డు లేకుండానే ఇకపై ఏటీఎం నుంచి డబ్బులు డ్రా

Soon make cardless cash withdrawals across all banks and ATM networks using UPI

  • యూపీఐ ద్వారా పనిచేసే విధానం
  • ఏటీఎం స్క్రీన్ పై కనిపించే క్యూఆర్ కోడ్ 
  • స్కాన్ చేయడం ద్వారా డబ్బులు డ్రా చేసుకోవచ్చు
  • ఇంటర్ ఆపరేబులిటీ అమలు చేయాలని ఆర్బీఐ నిర్ణయం

ఏటీఎం/డెబిట్ కార్డు లేకపోయినా సమీపంలో ఉన్న ఏ బ్యాంకు ఏటీఎం నుంచి అయినా డబ్బులు డ్రా చేసుకునే విధానం త్వరలోనే అమల్లోకి రానుంది. దీంతో యూపీఐ (యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ ఫేస్) విధానంలో అన్ని బ్యాంకు శాఖలు, ఏటీఎంల నుంచి సులభంగానే డబ్బులను డ్రా చేసుకోవచ్చు. తాజా ద్రవ్య పరపతి విధాన సమీక్షలో భాగంగా ఆర్బీఐ ఈ నిర్ణయాన్ని అమలు చేయాలని నిర్ణయించింది.

కార్డులతో మోసాలకు అవకాశం ఉంటుందన్న విషయం తెలిసిందే. కార్డు స్కీమింగ్, కార్డు క్లోనింగ్ తో నేరగాళ్లు కార్డుల వివరాలు కొట్టేసి డూప్లికేట్ తయారు చేసి, ఖాతాదారుల సొమ్మును కొల్లగొడుతున్న ఘటనలు వెలుగు చూస్తూనే ఉన్నాయి. కార్డులెస్ అయితే వీటికి అవకాశం ఉండదు. 

ఇలా కార్డుల్లేకుండా నగదు ఉపసంహరణ విధానం ప్రస్తుతం ఎస్బీఐ సహా కొన్ని బ్యాంకుల పరిధిలో అమల్లో ఉంది. కాకపోతే ఒక బ్యాంకు కస్టమర్ వేరే బ్యాంకు ఏటీఎంలో కార్డు లేకుండా డబ్బుులు డ్రా చేసుకోవడం సాధ్యపడదు. ఇకపై ఒక బ్యాంకు ఖాతాదారు ఏ బ్యాంకు ఏటీఎం నుంచి అయినా కార్డులేకుండా డబ్బులు డ్రా చేసుకోవడమే కొత్త విధానం. ఇందుకు వీలుగా ఇంటర్ ఆపరేబులిటీని ఆర్బీఐ అమల్లోకి తీసుకొస్తోంది. 

ఎస్బీఐ, హెచ్ డీఎఫ్ సీ బ్యాంకులు కార్డు లేకుండా తమ ఏటీఎంల నుంచి డబ్బులు డ్రా చేసుకునే ఆప్షన్ సదుపాయాన్ని ఇప్పటికే అందిస్తున్నాయి. ఎస్బీఐ లో అయితే యోనో యాప్ సాయంతో డబ్బులు డ్రా చేసుకోవచ్చు. ఫోన్ లో యోనో యాప్ ను తెరిచి.. ఏటీఎం స్క్రీన్ పై కనిపించే క్యూఆర్ కోడ్ ను స్కాన్ చేయడం ద్వారా ఈ సదుపాయం పనిచేస్తుంది.

  • Loading...

More Telugu News