Congress: ర‌ష్యా మాదిరే చైనా.. మోదీ సర్కారు వాస్తవాలను గుర్తించ‌డం లేదు: రాహుల్ గాంధీ

rahul gandhi comments on russi and ukraine war

  • ఉక్రెయిన్‌పై ర‌ష్యా యుద్ధానికి కార‌ణం చెప్పిన రాహుల్‌
  • ర‌ష్యా అస‌లు ల‌క్ష్యం ఉక్రెయిన్‌ను ఏకాకిని చేయ‌డ‌మేన‌ని వ్యాఖ్య  
  •  లడఖ్, అరుణాచ‌ల్ ప్ర‌దేశ్ లు మీవి కాదని చైనా అంటోందన్న రాహుల్ 
  •  పరిస్థితి విషమించినప్పుడు ఎదుర్కోలేమన్న రాహుల్  ‌

ఉక్రెయిన్‌పై దండెత్తిన ర‌ష్యా దురాక్ర‌మ‌ణ వైఖ‌రిని ప్ర‌స్తావిస్తూ కాంగ్రెస్ పార్టీ కీల‌క నేత రాహుల్ గాంధీ కేంద్ర ప్ర‌భుత్వంపై విరుచుకుపడ్డారు. 

"ఉక్రెయిన్‌పై ర‌ష్యా దండెత్త‌డానికి కార‌ణం ర‌ష్యా దురాక్ర‌మ‌ణ వాద‌మే. ఉక్రెయిన్‌లోని డొనెట్క్స్‌, లుహాన్క్స్ ప్రాంతాలు అస‌లు ఉక్రెయిన్ అంత‌ర్భాగాల‌ని ర‌ష్యా భావించ‌డం లేదు. అస‌లు దేశాల మ‌ధ్య స‌రిహ‌ద్దుల‌ను కూడా ర‌ష్యా గౌర‌వించ‌డం లేదు. కేవ‌లం ఈ భావ‌న‌తోనే ఉక్రెయిన్‌పై ర‌ష్యా దండెత్తింది. ఈ దండ‌యాత్ర వెనుక అస‌లు లక్ష్యం నాటో, అమెరికాల నుంచి ఉక్రెయిన్ ను విడ‌దీయ‌డ‌మే" అని రాహుల్ ఉక్రెయిన్‌పై ర‌ష్యా యుద్ధం మీద త‌న‌దైన విశ్లేష‌ణ‌ను వినిపించారు.

ర‌ష్యా త‌ర‌హాలోనే భార‌త పొరుగు దేశం చైనా కూడా వ్య‌వ‌హ‌రిస్తోంద‌ని రాహుల్ గాంధీ స‌రికొత్త వాద‌న‌ను వినిపించారు. "లడఖ్, అరుణాచ‌ల్ ప్ర‌దేశ్ లు మీవి (ఇండియా) కాదని చైనా అంటోంది. అక్క‌డ తన సైనికులను దింపుతోంది. ప్రభుత్వం దీనిని లక్ష్యపెట్టడం లేదు. మన కళ్లెదురుగా ఓ మోడల్ (రష్యా-ఉక్రెయిన్ వివాదం) కనిపిస్తోంది. ఇక్కడ కూడా అదే జరిగే అవకాశం వుంది. కానీ, మోదీ సర్కారు ఈ వాస్తవాలను గుర్తించ‌డం లేదు. వాస్తవాన్ని అంగీకరించమని నేను ప్రభుత్వానికి చెబుతున్నాను. అలా చేయలేకపోయినా, మనకు మనం సంసిద్ధులం కాకపోయినా.. రేపు పరిస్థితి విషమించినప్పుడు ఎదుర్కోలేం" అని రాహుల్ గాంధీ ఆందోళ‌న వ్య‌క్తం చేశారు.

  • Loading...

More Telugu News