Tammineni Sitaram: కబుర్లు చెప్పడం కాదు... కేంద్రం నుంచి డబ్బులు తీసుకురండి: బీజేపీ నేతలకు స్పీకర్ తమ్మినేని హితవు

Speaker Tammineni Sitharam fires on AP BJP leaders
  • ఉత్తరాంధ్రలో బీజేపీ జనపోరు యాత్ర
  • వైసీపీపై బీజేపీ నేతల విమర్శలు
  • బీజేపీ నేతలు ఆత్మపరిశీలన చేసుకోవాలన్న తమ్మినేని 
ఉత్తరాంధ్ర జలాల అంశంలో ఏపీ బీజేపీ నేతలు జన పోరు యాత్ర చేపట్టడం తెలిసిందే. ఈ సందర్భంగా బీజేపీ నేతలు గత, ప్రస్తుత ప్రభుత్వాలపై విమర్శలు చేస్తూ యాత్ర కొనసాగిస్తున్నారు. దీనిపై ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం స్పందించారు. ప్రాజెక్టుల విషయంలో తమపై విమర్శలు చేస్తున్న బీజేపీ నేతలు ఓసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలని అన్నారు. కబుర్లు చెప్పడం మాని కేంద్రం నుంచి నిధులు తీసుకురావాలని హితవు పలికారు. 'చేతనైతే విశాఖ స్టీల్ ప్లాంట్ విక్రయించకుండా కేంద్రాన్ని నిలువరించండి... పోలవరం, ప్రత్యేక హోదా, రైల్వే జోన్ పై మాట్లాడండి' అని స్పష్టం చేశారు.
Tammineni Sitaram
AP BJP Leaders
Uttarandhra
YSRCP
Andhra Pradesh

More Telugu News