Covishield: బూస్టర్ డోసుపై సీరం కీలక నిర్ణయం... ధర రూ.600 నుంచి రూ.225కి తగ్గింపు

Serum revised Covishield booster dose price

  • 18 ఏళ్లకు పైబడిన వారికి బూస్టర్ డోసు
  • ప్రైవేటు ఆసుపత్రుల్లో డోసులు
  • కొవిషీల్డ్ ధరను రూ.600గా పేర్కొన్న సీరం
  • తాజాగా భారీగా ధర తగ్గించిన వైనం 

దేశంలోని 18 ఏళ్లు, అంతకు పైబడినవారికి కరోనా వ్యాక్సిన్ బూస్టర్ డోసు ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది. అయితే ఫ్రంట్ లైన్ వర్కర్స్ కు, 60 ఏళ్లకు పైబడినవారికి కేంద్రమే ఉచితంగా బూస్టర్ డోసు ఇస్తోంది. 18, అంతకు పైబడిన వారికి మాత్రం ప్రైవేటు కరోనా వ్యాక్సినేషన్ కేంద్రాల్లో బూస్టర్ డోసు ఇవ్వనున్నారు. కొవిషీల్డ్ వ్యాక్సిన్ తయారీదారు సీరం ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎస్ఐఐ) ఒక బూస్టర్ డోసు ధర రూ.600 అని నిన్న ప్రకటించింది. 

అయితే, ధర మరీ ఎక్కువన్న అభిప్రాయాలు వినిపించడంతో, సీరం తన నిర్ణయాన్ని పునఃసమీక్షించుకుంది. దీనిపై సీరం అధినేత అదార్ పూనావాలా స్పందించారు. ప్రైవేటు ఆసుపత్రులకు అందించే కొవిషీల్డ్ బూస్టర్ డోసు ధరలను సవరించామని వెల్లడించారు. ఒక డోసు ధర రూ.600 నుంచి రూ.225కి తగ్గించామని తెలిపారు. 18 ఏళ్లకు పైబడిన వారందరికీ బూస్టర్ డోసు ఇవ్వాలన్న కేంద్రం నిర్ణయాన్ని మరోసారి అభినందిస్తున్నామని పూనావాలా పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News