Telangana: తెలంగాణలో మరింత తగ్గిన కరోనా యాక్టివ్ కేసులు

Corona active cases numbers declines in Telangana
  • గత 24 గంటల్లో 16,580 కరోనా పరీక్షలు
  • 24 కొత్త కేసులు నమోదు
  • హైదరాబాదులో 14 కేసులు
  • కరోనా నుంచి కోలుకున్న 40 మంది
  • 232కి తగ్గిన యాక్టివ్ కేసుల సంఖ్య
తెలంగాణలో గడచిన 24 గంటల్లో 16,580 శాంపిల్స్ పరీక్షించగా, 24 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అత్యధికంగా హైదరాబాదులో 14 కొత్త కేసులు నమోదు కాగా, కరీంనగర్ జిల్లాలో 2, ఆదిలాబాద్, జయశంకర్ భూపాలపల్లి, ఖమ్మం, మహబూబ్ నగర్, మంచిర్యాల, నిర్మల్, మేడ్చల్ మల్కాజిగిరి, హనుమకొండ జిల్లాల్లో ఒక్కొక్క కేసు చొప్పున వెల్లడయ్యాయి. అదే సమయంలో 40 మంది కరోనా నుంచి కోలుకున్నారు. కొత్తగా మరణాలేవీ సంభవించలేదు. 

రాష్ట్రంలో ఇప్పటిదాకా 7,91,485 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 7,87,142 మంది ఆరోగ్యవంతులయ్యారు. యాక్టివ్ కేసుల సంఖ్య మరింత తగ్గింది. ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా 232 కరోనా యాక్టివ్ కేసులు మాత్రమే ఉన్నాయి. అటు, రాష్ట్రంలో కరోనాతో ఇప్పటివరకు 4,111 మంది మరణించారు.
.
Telangana
Corona Virus
Active Cases
Daily Updates
Today Cases

More Telugu News