CCMB: కొలెస్ట్రాల్‌ను కరిగించే మందులు వాడుతున్నారా?.. అయితే జాగ్రత్త!

Statins can induce changes in architecture of cells reveals CCMB

  • కొలెస్ట్రాల్‌ను కరిగించేందుకు స్టాటిన్స్ ఔషధం వాడకం
  • వినియోగం ఎక్కువైతే కణాల నిర్మాణంలో మార్పులు
  • సీసీఎంబీ పరిశోధనలో వెల్లడి

రక్తంలో పేరుకుపోయిన కొలెస్ట్రాల్‌ను కరిగించేందుకు మందులు వాడుతున్నారా? అయితే, ఇది మీకొసమే. ఈ ఔషధాలను దీర్ఘకాలం వినియోగించడం వల్ల దుష్ప్రభావాలు తప్పవని సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (సీసీఎంబీ) పరిశోధనలో వెల్లడైంది. ఈ ఔషధాలు కణాల నిర్మాణంలో మార్పులకు కారణమవుతున్నట్టు కనుగొన్నారు. అయితే, గతంలోనూ ఇలాంటివి గుర్తించినప్పటికీ పరమాణు స్థానంలో ఇప్పటి వరకు ఎలాంటి ఆధారాలు లభ్యం కాలేదు. 

రక్తంలో పేరుకుపోయిన అధిక కొలెస్ట్రాల్‌ను తగ్గించేందుకు స్టాటిన్స్ అనే ఔషధాన్ని ఉపయోగిస్తుంటారు. ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా అమ్ముడవుతున్న ఔషధాల్లో ఇదొకటి. వీటి వాడకం ఎక్కువైతే కణ నిర్మాణంలో మార్పులను అవి ఎలా ప్రేరేపిస్తాయో గుర్తించినట్టు సీసీఎంబీ ప్రొఫెసర్ చటోపాధ్యాయ బృందం తెలిపింది. 

రక్తంలోని కొలెస్ట్రాల్‌ను తగ్గించే స్టాటిన్.. కణ నిర్మాణానికి కీలకమైన ఆక్టిన్ ప్రొటీన్ల పాలిమరైజేషన్‌ను ప్రేరేపిస్తుందని, ఫలితంగా కణాల పరిమాణం, పనితీరులో మార్పులు సంభవిస్తాయని అధ్యయనం పేర్కొంది. అధ్యయన వివరాలు అమెరికన్ సొసైటీ ఆఫ్ బయోకెమిస్ట్రీ అండ్ మాలిక్యులర్ బయాలజీ నుంచి వెలువడే జర్నల్ ఆఫ్ లిపిడ్ రీసెర్చ్‌లో ప్రచురితమైంది.

  • Loading...

More Telugu News