New Cabinet: ఏపీలో రేపు కొత్త మంత్రుల ప్రమాణస్వీకారోత్సవం... ఏర్పాట్లు పూర్తి

All set for AP New Cabinet oath taking ceremony
  • ఏపీలో 25 మందితో కొత్త మంత్రివర్గం
  • ఖరారు చేసిన సీఎం జగన్
  • సోమవారం ఉదయం 11.31 గంటలకు ప్రమాణం
  • అమరావతి సచివాలయం వద్ద వేదిక
ఏపీలో కొత్త మంత్రివర్గం రేపు కొలువుదీరనుంది. ఇవాళ నూతన క్యాబినెట్ ను సీఎం జగన్ ఖరారు చేయడం తెలిసిందే. సోమవారం ఉదయం 11.31 గంటల ముహూర్తానికి కొత్త మంత్రులతో గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ప్రమాణస్వీకారం చేయించనున్నారు. అమరావతి సచివాలయం వద్ద అందుకోసం భారీగా ఏర్పాట్లు చేశారు. రాష్ట్ర ప్రోటోకాల్ విభాగం, వివిధ శాఖల అధికారులు ఈ ఏర్పాట్లలో భాగం పంచుకున్నారు. ఈ కార్యక్రమానికి పోలీసు శాఖ విస్తృతస్థాయిలో బందోబస్తు ఏర్పాటు చేసింది. 

ప్రమాణం చేయనున్న కొత్త మంత్రులు, వారి కుటుంబ సభ్యులు, అఖిల భారత సర్వీసుల అధికారులు, వివిధ రంగాల ప్రముఖులు, పాత్రికేయులు కూర్చునేందుకు పలు గ్యాలరీలు ఏర్పాటు చేశారు.
New Cabinet
Oath Taking Ceremony
YSRCP
Andhra Pradesh

More Telugu News