Chandrababu: అన్ని పార్టీలు నేడు బీసీల గురించి మాట్లాడాల్సిన పరిస్థితి కల్పించింది టీడీపీనే: చంద్రబాబు

Chandrababu pays tributes to Jyothiba Phule

  • నేడు జ్యోతిబా ఫూలే జయంతి
  • నివాళులు అర్పించిన చంద్రబాబు
  • బీసీలు-టీడీపీది విడదీయరాని అనుబంధమని వెల్లడి
  • టీడీపీ డీఎన్ఏలోనే బీసీల అభివృద్ధి ఉందని వ్యాఖ్యలు

దేశంలో తొలితరం సామాజిక సంస్కర్త జ్యోతిబా ఫూలే జయంతి సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఆ మహనీయునికి నివాళులు అర్పించారు. జ్యోతిబా ఫూలే వంటి మహోన్నతుల ఆశయ స్ఫూర్తితో టీడీపీని స్థాపించడం జరిగిందని వెల్లడించారు. టీడీపీ... వెనుకబడిన వర్గాల్లో రాజకీయ చైతన్యం కలిగించి, వారిలో సామాజిక, రాజకీయ, ఆర్థిక పురోగతికి 40 ఏళ్లుగా కృషి చేస్తోందని తెలిపారు. 

బీసీలది, టీడీపీది విడదీయరాని అనుబంధం అని చంద్రబాబు ఉద్ఘాటించారు. తెలుగుదేశం పార్టీ డీఎన్ఏలోనే బీసీల అభివృద్ధి ఇమిడి ఉందని స్పష్టం చేశారు. టీడీపీ అంటేనే బీసీల పార్టీ అనే వాస్తవం ఎవరూ కాదనలేనిదని పేర్కొన్నారు. రాష్ట్రంలో, దేశంలో అన్ని రాజకీయ పక్షాలు నేడు బీసీల గురించి మాట్లాడాల్సిన పరిస్థితి కల్పించింది టీడీపీనే అని చంద్రబాబు వివరించారు. 

"స్థానిక సంస్థల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు 26 ఏళ్ల పాటు అమల్లో ఉన్నాయంటే అందుకు కారణం టీడీపీనే. రాష్ట్రంలో టీటీడీ చైర్మన్ పదవితో పాటు 16 వర్సిటీల్లో 9 వర్సిటీలకు వైస్ చాన్సలర్లుగా బీసీలను నియమించాం. ఆదరణ పథకం ద్వారా చేతి వృత్తిదారులకు ఉపాధి కల్పించాం" అని వెల్లడించారు.

  • Loading...

More Telugu News