COVID19: దేశంలో పెరిగిన కరోనా రోజువారీ కేసులు

Slight Increase In Covid Daily Cases
  • నిన్న 1,088 మందికి పాజిటివ్
  • అంతకుముందు రోజుతో పోలిస్తే 292 కేసులు అధికం
  • 10,870కి తగ్గిన యాక్టివ్ కేసులు
దేశంలో కరోనా రోజువారీ కేసులు కాస్త పెరిగాయి. అంతకుముందు రోజుతో పోలిస్తే నిన్న మహమ్మారి బాధితులు ఎక్కువయ్యారు. మొన్న 796 మంది మహమ్మారి బారిన పడితే.. నిన్న 292 కేసులు ఎక్కువగా నమోదయ్యాయి. 1,088 మందికి పాజిటివ్ వచ్చింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4,30,38,016కు పెరిగాయి. మరో 26 మంది మహమ్మారికి బలవ్వగా.. మొత్తం మృతుల సంఖ్య 5,21,736కి పెరిగాయి. 

మరోవైపు యాక్టివ్ కేసులు తగ్గుముఖం పట్టాయి. తాజాగా 10,870కి తగ్గాయి. అలాగే మరో 1,081 మంది కరోనా బారిన నుంచి కోలుకోగా.. మొత్తం కోలుకున్న వారి సంఖ్య 4,25,05,410కి పెరిగింది. రికవరీ రేటు 98.76 శాతంగా ఉంది. మొత్తంగా ఇప్పటిదాకా 186,07,06,499 డోసుల టీకాలు వేశారు.
COVID19
Corona Virus

More Telugu News