Audimulapu Suresh: మంత్రిగా బాధ్య‌త‌లు స్వీక‌రించిన‌ ఆదిమూలపు సురేశ్.. పరిపాలన వికేంద్రీకరణ చేపడతామని వ్యాఖ్య‌

suresh takes oath as minister

  • జగన్ అప్పగించిన బాధ్యతల‌ను చిత్తశుద్ధితో నిర్వర్తిస్తానన్న మంత్రి  
  • జ‌గ‌న్ ఆలోచనలకు అనుగుణంగా ఉంటుందని వ్యాఖ్య 
  • రాష్ట్రాన్ని క్లీన్ ఆంధ్రప్రదేశ్‌గా తీర్చిదిద్దుతామన్న సురేశ్

ఏపీ పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా ఆదిమూలపు సురేశ్ బాధ్యతలు చేపట్టారు. ఈ సంద‌ర్భంగా సచివాలయంలోని తన ఛాంబర్‌లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంత‌రం ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ... ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్ అప్పగించిన బాధ్యతల‌ను చిత్తశుద్ధితో నిర్వర్తిస్తాన‌ని చెప్పారు. జ‌గ‌న్ ఆలోచనలకు అనుగుణంగా పరిపాలన వికేంద్రీకరణ చేపడతామని ఆయ‌న చెప్పారు. 

రాష్ట్రాన్ని క్లీన్ ఆంధ్రప్రదేశ్‌గా తీర్చిదిద్దుతామని ఆయ‌న అన్నారు. కాగా, ఆదిమూల‌పు సురేశ్ ఐఆర్‌ఎస్‌ అధికారిగా 22 సంవత్సరాల పాటు పనిచేశారు. 2009లో త‌న‌ ఉద్యోగానికి రాజీనామా చేసి, రాజకీయాల్లోకి వచ్చారు. 2009లో కాంగ్రెస్ పార్టీ తరఫున యర్రగొండ పాలెం నుంచి పోటీ చేసి విజ‌యం సాధించారు. 

అనంత‌రం  2014లో సంతనూతలపాడు నుంచి వైసీపీ త‌ర‌ఫున పోటీ చేసి గెలుపొందారు. 2019 ఎన్నికల్లోనూ యర్రగొండపాలెం నుంచి విజ‌యం సాధించిన ఆయ‌న గ‌త‌ ఏపీ మంత్రివర్గంలో విద్యాశాఖ మంత్రిగా పనిచేశారు. ఇప్పుడు ఆయ‌న‌కు ఏపీ పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా ప‌ద‌వి ద‌క్కింది.

  • Loading...

More Telugu News