Imran Khan: స్టార్ హోట‌ల్‌లో పాక్ మాజీ ప్ర‌ధాని ఇమ్రాన్, ప్ర‌స్తుత ప్ర‌ధాని షెహ‌బాజ్ మ‌ద్దతుదారుల ఫైటింగ్.. వీడియో వైర‌ల్

fighting between imran shareef supporters
  • ప‌ర‌స్ప‌రం ఆహార ప‌దార్థాలు, డ్రింక్స్ విసిరేసుకున్న వైనం
  • ఓ వృద్ధుడిని కింద ప‌డేసి కొట్టిన వ్య‌క్తి 
  • పిడిగుద్దులు కురిపించుకున్న నేత‌లు
ఓ స్టార్ హోట‌ల్‌లో పాక్ మాజీ ప్ర‌ధాని ఇమ్రాన్ ఖాన్‌, ప్ర‌స్తుత ప్ర‌ధాని షెహ‌బాజ్ ఫ‌రీఫ్‌ మ‌ద్దతుదారులు గొడ‌వప‌డ్డారు. ప‌ర‌స్ప‌రం ఆహార ప‌దార్థాలు, డ్రింక్స్ విసిరేసుకున్నారు. హోట‌ల్‌లో అంద‌రూ చూస్తుండ‌గానే నెట్టుకున్నారు. ఓ వృద్ధుడిని కింద ప‌డేసిన‌ ఓ వ్య‌క్తి ఆయ‌న‌పై దాడి చేశాడు. ఇరు నేత‌ల మ‌ద్ద‌తుదారులు పిడిగుద్దులు కురిపించుకున్నారు. 

ఇందుకు సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. ఇమ్రాన్ ఖాన్ ప్ర‌ధాని పదవిని కోల్పోయినప్ప‌టి నుంచి ఆయ‌న మ‌ద్ద‌తుదారులు, షెహ‌బాజ్ ఫ‌రీఫ్‌ మ‌ద్దతుదారుల మ‌ధ్య త‌రుచూ గొడ‌వలు జ‌రుగుతున్నాయి. పరస్పరం ఎదురుప‌డ్డ‌ప్పుడ‌ల్లా వారు కొట్టుకున్న ఘ‌ట‌న‌ల‌కు సంబంధించిన వీడియోలు కొన్ని రోజులుగా సామాజిక మాధ్య‌మాల్లో క‌న‌ప‌డుతున్నాయి.
Imran Khan
Pakistan
Viral Videos

More Telugu News