KTR: దళితులకు రూ.10 లక్షలు ఇచ్చిన మగాడు దేశంలో ఉన్నాడా?: కేటీఆర్
- రాజ్యాంగాన్ని తుంగలో తొక్కుతున్నది ఎవరన్న కేటీఆర్
- వ్యవస్థలను కుప్పకూలుస్తున్నది ఎవరని ప్రశ్న
- మంచి పనులు చేస్తుంటే కేంద్రం అడ్డుపడుతోందని విమర్శ
- మంచి, చెడులను ప్రజలు ఎన్నికల్లో చూసుకుంటారన్న మంత్రి
టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు (కేటీఆర్) గురువారం అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీని టార్గెట్ చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో దళితులకు రూ.10 లక్షలు ఇచ్చిన మగాడు ఉన్నాడా? అంటూ వ్యాఖ్యానించిన ఆయన తెలంగాణలో తమ ప్రభుత్వం దళితుల అభ్యున్నతి కోసం దళిత బంధు పేరిట ప్రతి దళిత కుటుంబానికి రూ.10 లక్షలు ఇచ్చే పథకానికి రూపకల్పన చేశామని ఆయన చెప్పారు.
"రాజ్యాంగాన్ని తుంగలో తొక్కుతున్నది ఎవరో ఆలోచించాలి. వ్యవస్థలను కుప్పకూలుస్తున్నది ఎవరు? వ్యవస్థలను అడ్డం పెట్టుకుని రాజకీయం చేస్తున్నారు. మంచి పనులు చేస్తుంటే కేంద్రం అడ్డుపడుతోంది. మంచి, చెడులను ప్రజలు ఎన్నికల్లో చూసుకుంటారు. దళితులకు రూ.10 లక్షలు ఇచ్చిన మగాడు దేశంలో ఉన్నాడా? బలహీన వర్గాల కోసం బలంగా పనిచేసే సీఎం ఈ దేశంలో ఎక్కడైనా ఉన్నాడా?" అంటూ కేటీఆర్ ప్రశ్నించారు.