Adimulapu Suresh: బాలినేనితో విభేదాల‌పై మంత్రి ఆదిమూల‌పు సురేశ్ స్పంద‌న

ap minister suresh comments on differences with balineni srinivasa reddy
  • బాలినేనితో విభేదాల్లేవన్న మంత్రి 
  • అవన్నీ మీడియా సృష్టించిన‌వేనని వ్యాఖ్య 
  • బాలినేని వ‌ల్లే తనకు రెండోసారి మంత్రి ప‌ద‌వన్న సురేశ్‌
ఏపీ మంత్రివ‌ర్గ పున‌ర్వ్య‌వ‌స్థీక‌ర‌ణ త‌ర్వాత తమ నేత‌ల్లో క్ర‌మంగా విభేదాలు బ‌య‌ట‌ప‌డుతు‌న్నాయ‌న్న వాద‌న‌ల్లో ఎలాంటి వాస్త‌వం లేద‌ని వైసీపీ నేత‌లు చెబుతున్నారు. ఇందులో భాగంగా ప్ర‌కాశం జిల్లాకు చెందిన తాజా మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస‌రెడ్డితో త‌న‌కు విభేదాలు ఉన్నాయ‌న్న వార్త‌ల‌పై మంత్రి ఆదిమూల‌పు సురేశ్ తాజాగా స్పందించారు. బాలినేనితో త‌న‌కు ఎలాంటి విభేదాలు లేవ‌ని కూడా ఆయ‌న స్ప‌ష్టం చేశారు. 

ఈ సంద‌ర్భంగా మంత్రి సురేశ్ చెబుతూ.. 'బాలినేనితో నాకు విభేదాలు లేవు. అవ‌న్నీ మీడియా సృప్టించిన‌వే. బాలినేని వ‌ల్లే నాకు రెండోసారి మంత్రి ప‌ద‌వి వ‌చ్చింది. బాలినేని నాయ‌క‌త్వంలో జ‌గ‌న్‌ను మ‌రోసారి సీఎం చేసేందుకు కృషి చేస్తాం' అని తెలిపారు. 
Adimulapu Suresh
YSRCP
Balineni Srinivasa Reddy
Prakasam District

More Telugu News