Chandrababu: టీడీపీ తెలుగువారి సాంస్కృతిక వారసత్వానికి అండగా నిలుస్తుంది అనడానికి ఇదొక నిదర్శనం: చంద్రబాబు
- నేడు ఒంటిమిట్టలో సీతారాముల కల్యాణం జరుగుతుందన్న చంద్రబాబు
- భక్తులందరికీ శుభాకాంక్షలు తెలిపిన నేత
- విభజన కారణంగా ఏపీ ప్రజలు భద్రాద్రిని కోల్పోయారని వ్యాఖ్య
- రామాలయాన్ని రూ.100 కోట్లతో అభివృద్ధి చేశామని ట్వీట్
తెలుగుదేశం పార్టీ తెలుగువారి సాంస్కృతిక వారసత్వానికి అండగా నిలుస్తుందని, అందుకు తాము ఒంటిమిట్ట ఆలయాన్ని అభివృద్ధి చేయడమే నిదర్శనమని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు.
'ఈరోజు రాత్రి ఒంటిమిట్టలో సీతారాముల కల్యాణం జరుగుతున్న సందర్భంగా భక్తులందరికీ శుభాకాంక్షలు. విభజన కారణంగా భద్రాద్రిని కోల్పోయిన ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఆ లోటు కనపడనీయకుండా, కడప జిల్లాలో 450 ఏళ్ల చరిత్ర కలిగిన కోదండ రామాలయాన్ని గత తెలుగుదేశం హయాంలో రూ.100 కోట్లతో అభివృద్ధి చేశాం.
ఒంటిమిట్ట ఆలయ నిర్వహణలో లోపాలు రాకూడదన్న ఉద్దేశంతో టీటీడీ పరిపాలన కిందకు తెచ్చాం. కల్యాణ వేదికను నిర్మించి ఆలయానికి కొత్త శోభను తెచ్చాం. తెలుగుదేశం పార్టీ తెలుగువారి సాంస్కృతిక వారసత్వానికి అండగా నిలుస్తుంది అనడానికి ఇదొక నిదర్శనం' అని చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.