Ponguleti Srinivas Reddy: కేటీఆర్ కు మా ఇంట్లో భోజనం ఏర్పాట్లు చేస్తాం: పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

Poguleti Srinivas Reddy response on quitting TRS
  • పొంగులేటి పార్టీ మారబోతున్నారంటూ ప్రచారం
  • ఎప్పటికీ టీఆర్ఎస్ లోనే ఉంటానన్న పొంగులేటి
  • సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం

మాజీ ఎంపీ, టీఆర్ఎస్ నేత పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పార్టీ మారబోతున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ ఇందులో నిజం లేదని చెప్పారు. కొందరు వ్యక్తులు వారి ఇమేజ్ ను పెంచుకోవడం కోసం ఇలాంటి తప్పుడు వార్తలను సోషల్ మీడియాలో పెడుతున్నారని మండిపడ్డారు. తాను ఎప్పటికీ టీఆర్ఎస్ లోనే ఉంటానని చెప్పారు. 

టీఆర్ఎస్ పార్టీ మెడలు వంచామంటూ బీజేపీ నేతలు చెప్పుకుంటున్న మాటలను విని జనాలు నవ్వుకుంటున్నారని అన్నారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ వ్యాఖ్యలు అహంకారపూరితంగా ఉంటున్నాయని విమర్శించారు. రైతులకు అన్ని విధాలుగా న్యాయం చేస్తున్న పార్టీ టీఆర్ఎస్ మాత్రమేనని చెప్పారు. రైతుల నుంచి ప్రతి ఏటా టీఆర్ఎస్ ప్రభుత్వం ధాన్నాన్ని కొనుగోలు చేస్తుందని అన్నారు. మంత్రి కేటీఆర్ ఖమ్మంకు వస్తున్నారని... తమ ఇంట్లో ఆయనకు భోజనం ఏర్పాట్లు చేస్తామని చెప్పారు.
Ponguleti Srinivas Reddy
KTR
TRS
Bandi Sanjay
BJP

More Telugu News