Revanth Reddy: కేసీఆర్ కు తెలియకుండా ఇది సాధ్యమా?: రేవంత్ రెడ్డి

Is it possible without knowing KCR asks Revanth Reddy
  • ఎనిమిదేళ్లుగా సీఎంఆర్ స్కామ్ యథేచ్ఛగా సాగుతోందన్న రేవంత్ 
  • నిజామాబాద్ జిల్లాలోనే లక్ష క్వింటాళ్లు బొక్కారని ఆరోపణ 
  • సీబీఐ విచారణకు ఆదేశించకుండా ఆపుతున్నది ఎవరని ప్రశ్న 
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మరోసారి విమర్శలు గుప్పించారు. గత ఎనిమిదేళ్లుగా సీఎంఆర్ (కస్టమ్ మిల్లింగ్ రైస్) కుంభకోణం యథేచ్చగా సాగుతోందని రేవంత్ ఆరోపించారు. వానాకాలం పంటలో నిజామాబాద్ జిల్లాలోనే లక్ష క్వింటాళ్లు పందికొక్కుల్లా బొక్కారంటే... రాష్ట్రం మొత్తం మీద కుంభకోణం ఏ స్థాయిలో ఉంటుందోనని ఆయన అన్నారు.  

అసలు ముఖ్యమంత్రి కేసీఆర్ కు తెలియకుండానే ఇది సాధ్యమా? అని ఆయన ప్రశ్నించారు. ఈ స్కామ్ పై సీబీఐ విచారణకు ఆదేశించకుండా ఆపుతున్నది ఎవరని అడిగారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. దీంతో పాటు ఓ వార్తా పత్రికలో వచ్చిన 'నిజామాబాద్ జిల్లాలో సీఎంఆర్ స్కామ్.. లెవీ బియ్యాన్ని బహింరంగ మార్కెట్లో అమ్ముకున్న మిల్లర్లు' అనే కథనాన్ని షేర్ చేశారు.
Revanth Reddy
Congress
KCR
TRS
CMR Scam
Rice Scam

More Telugu News