Ram Gopal Varma: బన్నీయే కొత్త మెగా హీరో అని చిరంజీవి, రామ్ చరణ్ నిరూపించినట్టుగా ఉంది: రామ్ గోపాల్ వర్మ

Ram Gopal Varma tweeted Chiranjeevi and Ramchanr themselves saying Allu is the new mega hero
  • ఆచార్య నుంచి భలే భలే బంజారా పాట 
  • త్వరలో పాట రిలీజ్
  • ప్రోమో వీడియోలో చిరంజీవి, రామ్ చరణ్ సందడి
  • ఇరువురి మధ్య ఆసక్తికర సంభాషణ
మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న ఆచార్య చిత్రం నుంచి భలే భలే బంజారా అనే సాంగ్ రిలీజ్ కానుంది. ఈ పాటకు సంబంధించిన ప్రోమో వీడియో నిన్న రిలీజ్ అయింది. అందులో దర్శకుడు కొరటాల శివతో పాటు చిరంజీవి, రామ్ చరణ్ కూడా పాల్గొన్నారు. కొరటాల వెళ్లిపోయిన తర్వాత చిరు, చరణ్ మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది. ఏరా సెట్స్ పై డ్యాన్స్ లో నన్ను డామినేట్ చేద్దామనుకుంటున్నావా అంటూ చిరంజీవి ప్రశ్నించారు. లేదు అప్పా అంటూ చరణ్ బదులివ్వడం ఆ వీడియోలో చూడొచ్చు. 

అయితే దీనిపై దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తనదైన రీతిలో స్పందించారు. తాను మెగా రీతిలో బాధపడ్డానని వెల్లడించారు. "మెగా తండ్రి, మెగా తనయుడు మాట్లాడుకుంటూ తగ్గు, తగ్గను, తగ్గేదే లే అంటూ అల్లు అర్జున్ డైలాగులు ఉపయోగించారు. తద్వారా కొత్త మెగా హీరో అల్లు అర్జునే అని చిరంజీవి, రామ్ చరణ్ నిరూపించినట్టయింది" అంటూ వివరణ ఇచ్చారు. అంతేకాదు, చిరు, చరణ్ ల వీడియోను కూడా వర్మ ట్విట్టర్ లో పంచుకున్నారు.
Ram Gopal Varma
Chiranjeevi
Ramcharan
Allu Arjun
Mega Hero
Acharya
Tollywood

More Telugu News