Usha Sri Charan: ఆంజనేయస్వామి ఆలయంలో మంత్రి ఉషశ్రీ చరణ్ పూజలు... సందడి చేసిన వానరం... వీడియో ఇదిగో!

Monkey accompanied AP minister Usha Sri Charan at Kasapuram Anjaneya Swamy temple
  • కసాపురం ఆంజనేయస్వామి ఆలయంలో మంత్రి పూజలు
  • పక్కనే కూర్చున్న వానరం
  • ఎంత తరిమినా కదలని కోతి
  • సాక్షాత్తు ఆంజనేయుడే వచ్చాడన్న స్థానికులు
ఏపీ కొత్త మంత్రి ఉషశ్రీ చరణ్ కు విచిత్రమైన అనుభవం ఎదురైంది. మంత్రివర్గంలో స్థానం పొందిన ఆమె తాజాగా తన ప్రాంతంలోని కసాపురం ఆంజనేయస్వామి ఆలయాన్ని సందర్శించారు. స్త్రీ శిశు సంక్షేమ మంత్రి హోదాలో ఆమె రాకతో ఆలయం వద్ద కోలాహలం ఏర్పడింది. పార్టీ శ్రేణులు భారీగా తరలివచ్చాయి. 

అయితే, ఆలయంలో ఆంజనేయస్వామికి మంత్రి పూజలు నిర్వహిస్తుండగా ఓ వానరం వచ్చి, ఆమె వద్దనే కూర్చుంది. దాంతో మంత్రి ఓవైపు ఆ కోతిని గమనిస్తూనే పూజల్లో పాల్గొన్నారు. ఆ వానరం ఎంతకీ అక్కడ్నించి కదలకపోగా, మంత్రిని వెన్నంటే కూర్చుంది. 

దాంతో, అక్కడికి వచ్చిన వారందరూ హనుమంతుడే వానరం రూపంలో వచ్చి మంత్రిని ఆశీర్వదించాడంటూ చర్చించుకోవడం కనిపించింది. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
Usha Sri Charan
Minister
Kasapuram Anjaneya Swamy Temple
Monkey
Andhra Pradesh

More Telugu News