Andhra Pradesh: ఏపీలో పదో తరగతి పరీక్షల హాల్ టికెట్ల విడుదల

10th class hall tickets in AP released
  • ఈ నెల 27 నుంచి పరీక్షలు 
  • వెబ్ సైట్లో హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకునే వెసులుబాటు
  • హాల్ టికెట్లపై హెడ్ మాస్టర్ సంతకం చేయాల్సి ఉంటుంది
ఏపీలో పదో తరగతి పరీక్షలకు సంబంధించి హాల్ టికెట్లు విడుదలయ్యాయి. ప్రభుత్వ వెబ్ సైట్లో హాల్ టికెట్లు, విద్యార్థుల నామినల్ రోల్స్ పెట్టామని... వాటిని డౌన్ లోడ్ చేసుకోవాలని ప్రభుత్వ పరీక్షల విభాగం కార్యదర్శి దేవానందరెడ్డి తెలిపారు. హాల్ టికెట్లపై ప్రధానోపాధ్యాయులు సంతకం చేసి విద్యార్థులకు ఇవ్వాలని సూచించారు. విద్యార్థుల ఫొటోలు సరిగా లేకపోతే సరైన ఫొటోలను అతికించి, సంతకాలు చేసి ఇవ్వాలని తెలిపారు. ఏపీలో పదో తరగతి పరీక్షలు ఈ నెల 27న ప్రారంభం కానున్నాయి. 

పదో తరగతి పరీక్షల తేదీలు:
  • ఏప్రిల్‌ 27 - తెలుగు
  • ఏప్రిల్‌ 28 - సెకండ్‌ లాంగ్వేజ్‌
  • ఏప్రిల్‌ 29 - ఇంగ్లీష్‌
  • మే 2 -  గణితం
  • మే 4  -  సైన్స్‌ పేపర్‌-1
  • మే 5  -  సైన్స్‌ పేపర్‌-2
  • మే 6  -  సోషల్
Andhra Pradesh
10th Class
Hall Tickets

More Telugu News