Mohan Babu: నారాయణదాస్ నారంగ్ కుటుంబ సభ్యులను పరామర్శించిన మోహన్ బాబు

Mohan Babu consoles Narayan Das Narang family members
  • అనారోగ్యంతో కన్నుమూసిన నారంగ్
  • టాలీవుడ్ లో విషాద ఛాయలు
  • నారంగ్ నివాసానికి విచ్చేసిన మోహన్ బాబు
  • నారంగ్ మృతి పట్ల ప్రగాఢ సంతాపం
తెలుగు ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు, నిర్మాత, డిస్ట్రిబ్యూటర్, ఫైనాన్షియర్, ఏషియన్ సినిమాస్ అధినేత నారాయణ్ దాస్ నారంగ్ అనారోగ్యంతో మరణించడం తెలిసిందే. ఆయన మృతితో టాలీవుడ్ లో విషాద ఛాయలు అలముకున్నాయి. కాగా, నారాయణ్ దాస్ నారంగ్ కుటుంబ సభ్యులను ప్రముఖ సినీ నటుడు మోహన్ బాబు పరామర్శించారు. నారంగ్ మృతి పట్ల ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. మోహన్ బాబు రాకతో నారంగ్ నివాసం వద్ద మీడియా సందడి నెలకొంది. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో సందడి చేస్తున్నాయి.
Mohan Babu
Narayan Das Narang
Demise
Tollywood

More Telugu News